నిర్మాతగా నైనా, డిస్ట్రిబ్యూటర్ గానైనా దిల్ రాజుకు కలిసి వచ్చేది చిన్న సినిమాలే. డిస్ట్రిబ్యూటర్ గా పెద్దసినిమాలతో చాలా దెబ్బలు తిన్నాడు. కానీ ఆయన కొన్న చిన్న సినిమాలు ఏవీ ఆయన నమ్మకాన్ని, లాభాలను దెబ్బతీయలేదు. ఇప్పుడు మరో చిన్న సినిమా ఆయనకు లాభాల పంట పండించే దిశగా నడుస్తోంది. అదే కుమారి 21 ఎఫ్. ఈ సినిమాను దిల్ రాజు నైజాంకు రెండుకోట్ల పాతిక లక్షలకు కొన్నట్లు తెలుస్తోంది. ఇందులో పాతిక లక్షలు రిటర్న్ బుల్ అడ్వాన్స్.
ఇప్పుడు రెండు రోజులకే ఈ సినిమా శుక్ర, శనివారాలు రెండు రోజులకే కోటిన్నరకు పైగా షేర్ తీసుకువచ్చింది. ఆదివారం కలెక్షన్లు తెలియాల్సి వుంది. అంటే దిల్ రాజు కొన్న డబ్బులు వచ్చేసినట్లే. ఇక మండే నుంచి లాభాలే అన్నమాట. కాస్త ఓవర్ ఫ్లోస్ నిర్మాతకు ఇచ్చినా కూడా దిల్ రాజకు బాగానే గిట్టుబాటు అవుతుంది. పైగా చాలా వరకు ఓన్ అండ్ లీజ్డ్ థియేటర్లు కాబట్టి, మరింత లాభదాయకమే. మొత్తానికి దిల్ రాజకు ఎక్కడో సుడి వుంది.