దిల్ రాజు తెగింపు తగ్గలేదు

2017లో దిల్ రాజు నిర్మాతగా ఎంత లక్కీనో, డిస్ట్రిబ్యూటర్ గా అంత అన్ లక్కీ. అయినా కూడా వెనక్కు తగ్గడం లేదు. పోగొట్టుకున్న చోటే వెదుక్కోవాలన్నట్లు 2018లో కూడా స్ట్రాటజిక్ గా అడుగులు వేసి…

2017లో దిల్ రాజు నిర్మాతగా ఎంత లక్కీనో, డిస్ట్రిబ్యూటర్ గా అంత అన్ లక్కీ. అయినా కూడా వెనక్కు తగ్గడం లేదు. పోగొట్టుకున్న చోటే వెదుక్కోవాలన్నట్లు 2018లో కూడా స్ట్రాటజిక్ గా అడుగులు వేసి డిస్ట్రిబ్యూషన్ కంపెనీని కూడా లాభాల్లోకి తేవాలని భావిస్తున్నట్లు వుంది. 2017లో విడుదలయ్యే రెండు మీడియం సినిమాల అవుట్ రేట్ డిస్ట్రిబ్యూషన్ ను దిల్ రాజు తీసేసుకున్నారు. వీటిని ఎంజి పద్దతిలో పంపిణీకి దిల్ రాజు తీసుకోవడం విశేషం.

ఒక ప్రాజెక్టు వరుణ్ తేజ-వెంకీ అట్లూరి-భోగవిల్లి ప్రసాద్ ది. ఈ సినిమా 18కోట్ల రేంజ్ లో ఎంజి పద్దతిలో దిల్ రాజు పంపిణీ చేస్తారు. అంటే 18కోట్లు నిర్మాతకు పక్కా. ఆ పైన ఏమి వచ్చినా, నిర్మాతకు, దిల్ రాజుకు ఫిఫ్టీ.. ఫిఫ్టీ అన్నమాట.

ఇదే విధంగా నాని హీరోగా రెడీ అవుతున్న కృష్ణార్జున యుద్ధం సినిమాను 23కోట్ల ఎంజీ కి దిల్ రాజు తీసుకున్నారు. అంటే 23కోట్లు దాటిన తరువాత వచ్చిన దాంట్లో మళ్లీ నిర్మాతకు వాటా వుంటుంది.

అంటే ఈ రెండు సినిమాలు ఇరవై కోట్లకు పైగా వసూళ్లు సాగిస్తాయని దిల్ రాజు నమ్మకం అన్నమాట. వరుణ్ తేజ సినిమా అంటే, దిల్ రాజు కాంపౌండ్ లో పుట్టి, పెరిగి, ఆపైన భోగవిల్లి ప్రసాద్ దగ్గరకు చేరింది. అందువల్ల ప్రాజెక్టు గురించి నమ్మకం. ఇక కృష్ణార్జున యుద్దం ప్రాజెక్టుకు నానిపై, డైరక్టర్ పై భరోసా. దర్ళకుడు మేర్లపాక మురళి మాంచి ఎంటర్ టైన్ మెంట్ అందించగలడన్న నమ్మకం.

దీన్ని బట్టి చూస్తుంటే, 2017లో భారీ సినిమాల పంపిణీ తీసుకుని లాస్ అయిన దిల్ రాజు, 2018లో మీడియం సినిమాలు అది కూడా యంగ్ హీరోల సినిమాలు టేకప్ చేసే ప్లాన్ పెట్టకున్నట్లుంది.