దిల్ రాజు-బహు పార్టీ బంధాలు

డిస్ట్రిబ్యూటర్ గా కెరీర్ ప్రారంభించి, నిర్మాతగా మారి, ఎగ్జిబిటర్ గా కాలూని, వటుండింతై, అంతంతై అన్నట్లుగా ఎదిగారు దిల్ రాజు అలియాస్ వెంకటేశ్వర రెడ్డి. ఇప్పుడు ఆయన అందరి వాడు అన్నట్లుగా అన్ని పార్టీలతో…

డిస్ట్రిబ్యూటర్ గా కెరీర్ ప్రారంభించి, నిర్మాతగా మారి, ఎగ్జిబిటర్ గా కాలూని, వటుండింతై, అంతంతై అన్నట్లుగా ఎదిగారు దిల్ రాజు అలియాస్ వెంకటేశ్వర రెడ్డి. ఇప్పుడు ఆయన అందరి వాడు అన్నట్లుగా అన్ని పార్టీలతో బంధాలు పెంచుకున్నారు. తెలంగాణ వ్యక్తిగా, అటు కేటిఆర్ కు సన్నిహితుడిగా వున్నారు. వంశీ పైడిపల్లితో స్నేహం ఆయనను కేటిఆర్ కు సన్నిహితుడిని చేసింది. 

ఆ తరవాత ఆయన వైకాపా రాయలసీమ నేతలతో బంధుత్వం కలుపుకున్నారు. ఆ విధంగా వైకాపాకు దగ్గరయ్యారు. జగన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రత్యేకంగా హాజరయ్యారు. 

ఆ మధ్య మోడీ బాలీవుడ్ ప్రముఖులను కలిసే కార్యక్రమానానికి దిల్ రాజు కూడా హాజరయ్యారు. బోనీకపూర్ తో వున్న వ్యాపార, స్నేహ సంబంధాలు దీనికి దారి చూపించి, ఆ అవకాశం వచ్చేలా చేసాయి.

లేటెస్ట్ గా జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ తో సినిమా నిర్మాణం ప్రారంభిస్తున్నారు. ఆ విధంగా జనసేనకు దగ్గరయ్యారు. అంటే తెరాస, వైకాపా, భాజపా, జనసేన పార్టీలతో దిల్ రాజుకు మంచి సంబంధాలు ఏర్పడినట్లే. ఇక మిగలింది టీడీపీ ఒక్కటే. ఆ మధ్య బాలయ్యతో సినిమా చేయాలని ప్రయత్నించారు కానీ కుదరలేదు. మంచి కథ దొరికితే ఆ ప్రయత్నం ఎలాగూ కొనసాగుతుంది. దాంతో అన్ని పార్టీల బందాలు కలిపేసుకున్నట్లే. 

సంక్రాంతి లాభాలు

ఈ సంక్రాంతి నిర్మాత దిల్ రాజు కంపెనీకి బోలెడు లాభాలు మోసుకువచ్చినట్లే. సరిలేరు, అల సినిమాల మీద దాదాపు 60 కోట్లు ఆయన డిస్ట్రిబ్యూషన్ పెట్టుబడి పెట్టారు. ఆ రెండింటి మీద కలిపి కనీసం పది నుంచి పదిహేను కోట్లు లాభం వస్తుందని ఇండస్ట్రీ సర్కిళ్లలో అంచనాలు వినిపిస్తున్నాయి. దర్బార్ సినిమా నష్టాలు ఏమీ తేలేదు. ఎంత మంచి వాడవురా సినిమా కేవలం డిస్ట్రిబ్యూషన్ మాత్రమే.

మొత్తం మీద ఇటు సినిమాలను, అటు రాజకీయాలను కలిపేసి మరీ దున్నేస్తున్నారు దిల్ రాజు.

లేడీస్ నైట్ ఉంటుందని అప్పుడే తెలిసింది