భావన కేసు విషయంలో మలయాళీ నటుడు దిలీప్ అరెస్టయిన విషయం తెలిసిందే. ఇప్పుడీ వివాదం దిలీప్ భార్య కావ్య మాధవన్ మెడకు కూడా చుట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. దిలీప్ తో పాటు ఆమె కూడా మలయాళీ చిత్ర పరిశ్రమలో కొనసాగుతోంది. దిలీప్ ను పెళ్లి చేసుకున్న తర్వాత కూడా సినిమాల్లో నటిగా కొనసాగుతోంది.
భావన కేసుకు సంబంధించి కావ్య మధవన్ ను కూడా పోలీసులు ప్రశ్నించే అవకాశాలున్నాయి. ఈ మేరకు కొచ్చిలోని ఎడబల్లిలో కావ్య మాధవన్ కు చెందిన ఓ వస్త్ర దుకాణంలో పోలీసులు సోదాలు నిర్వహించి కీలక సాక్ష్యాలు సేకరించారు. మరోవైపు కావ్య మాధవన్ తన వ్యక్తిగత ఫేస్ బుక్ ఖాతాను మూసేశారు. తన బొటిక్ పేరిట ఉన్న ఫేస్ బుక్ ఎకౌంట్ ను కూడా క్లోజ్ చేశారు.
మొన్నటివరకు భావన కేసుతో దిలీప్ కు మాత్రమే సంబంధం ఉందని అంతా భావించారు. కానీ ఇప్పుడు ఆయన భార్య కూడా తెరపైకి రావడంతో పలు అనుమనాలు వ్యక్తమౌతున్నాయి. ఇప్పటికే అరెస్ట్ అయిన కీలక నిందితుడు పల్సర్ సునీ, దిలీప్ మధ్య కావ్య మాధవన్ మధ్యవర్తిగా వ్యవహరించారనే అనుమానాల్ని పోలీసులు వ్యక్తం చేస్తున్నారు.