ఎంతవారికైనా ఏదో వీక్ నెస్ వుంటుంది. ఆ డైరక్టర్ కు కూడా అలాంటి అభిమానం వుందని టాలీవుఢ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే తొలుత ఆ అమ్మాయిని ఆ డైరక్టర్ నే టాలీవుడ్ కు పరిచయం చేసారు. ఆ సినిమా కు ఏమంత పేరు వచ్చేయలేదు కానీ సదరు డైరక్టర్ కు ఆ అమ్మాయికి మధ్య అభిమానాలు పెరిగిపోయాయని టాక్ మాత్రం వచ్చేసింది.
దాంతో ఆ డైరక్టర్ ఆ సినిమా చేసినపుడు యూనిట్ లో ఆ అమ్మాయికి 'మేడమ్' స్టేటస్ వచ్చేసింది. సర్లే, ఇండస్ట్రీలో ఈ వదంతులు కామన్ అని సరిపెట్టుకుంటే, మళ్లీ మరో సినిమాకు కూడా సదరు డైరక్టర్ ఆ హీరోయిన్ నే తీసుకున్నారు. ఈ విషయంలో హీరోకి ముందుగానే డైరక్టర్ తన కండిషన్ గా చెప్పేసినట్లు వినికిడి. ఆ తరువాత మళ్లీ మరో సినిమా చేసినపుడు అదే హీరోయిన్ ను తీసుకోవాలనుకున్నా, హీరో ఓకె అనకపోవడంతో, పక్కన పెట్టక తప్పలేదు.
ఆ తరువాత ఓ యంగ్ హీరోతో సినిమా అనుకున్నా, మళ్లీ ఇదే సబ్జెక్ట్ అక్కడా ఎదురైందని వినికిడి. అక్కడ కూడా హీరో ఆ హీరోయిన్ వద్దని అనడంతో పాటు, ఈ వ్యవహారాలు అన్నీ వుంటే సినిమా సరిగ్గా వస్తుందో రాదో అని ఆదిలోనే ఆ హీరో సినిమాకు ఫుల్ స్టాప్ పెట్టేసారు. ఆఖరికి చిన్న హీరోలను సెట్ చేసుకుని, సినిమా మొదలు పెట్టారు. అక్కడ కూడా మళ్లీ అదే కండిషన్..సదరు హీరోయిన్ నే ఫిక్స్. చిన్న హీరోలు కాబట్టి, ఓకె అన్నారు. సినిమా పట్టాలు ఎక్కేసింది. ఎంతయినా ఓ మనిషి మీద అభిమానం అంటే అలాగే వుంటుంది. మళ్లీ సదరు డైరక్టర్ యూనిట్ లో 'మేడమ్' స్టేటస్ హల్ చల్ చేస్తుందన్నమాట.