Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

డైరక్టర్లకు డైరక్టర్ డైరక్షన్

డైరక్టర్లకు డైరక్టర్ డైరక్షన్

ఒకప్పుడు సినిమాలు ఎలా సెట్ అయ్యేవి? నిర్మాత డైరక్టర్ ను, కథను సెట్ చేసుకుని, ఫైనాన్సియర్ ను చూసుకుని, అప్పుడు హీరో దగ్గరకు వెళ్లేవారు. ప్రాజెక్టు నచ్చితే హీరో ఒకె అనేవాడు. ఇప్పుడు రివర్స్ లో వుంది వ్యవహారం. హీరో ముందుగానే కొందరు నిర్మాతలను ఛూజ్ చేసి పెట్టుకుంటున్నాడు. అడ్వాన్స్ లు తీసుకుంటున్నాడు. ఆపైన ప్రాజెక్టుల కోసం వేటాడుతున్నారు.

ఈ క్రమంలో డైరక్టర్లు హీరోను అప్రోచ్ అవుతున్నారు. కథలు చెప్పి ఒప్పించుకుంటున్నారు. అప్పుడు హీరోనే ఆ ప్రాజెక్టును తనకు నచ్చిన నిర్మాతకు అలాట్ చేస్తున్నారు. టాప్ డైరక్టర్ల దగ్గరకు వచ్చేసరికి కీలకపాత్ర వారిదే అవుతోంది. టాప్ డైరక్టర్ల కోసం హీరోలు చూస్తున్నారు. వాళ్లకు డేట్ లు ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు. ఆ కాంబినేషన్ వల్లే మార్కెట్ అవుతోంది. ఇక్కడ నిర్మాతది పెట్టుబఢి, రిస్క్ అవుతోంది. ఆ పెట్టుబడి కూడా ఫైనాన్స్ నే.

ఇలాంటి నేపథ్యంలో ఓ టాప్ డైరక్టర్ మిగిలిన ముగ్గురు నలుగురు టాప్ డైరక్టర్లతో ఇదే చెబతున్నారట. ఇటీవల తరచు కాస్త పేరున్న డైరక్టర్లు షూటింగ్ ల వ్యవహారం పేరిట కలుస్తున్నారు. ఆ మాటా ఈ మాటా మాట్లాడుకుంటున్నారు.  ఈ సందర్భంగా ఓ పెద్ద దర్శకుడు మిగిలిన డైరక్టర్లకు కాస్త హితబోధ చేసే కార్యక్రమం చేపడుతున్నారని టాక్. 

'' మనం హీరోలను ఒప్పిస్తున్నాం. మన కథ చెబుతున్నాం. మన పేరు వాడి, మన కాంబినేషన్ పేరు వాడి మార్కెట్ చేసుకుంటున్నారు. వాళ్లు కూడా స్వంత డబ్బు పెట్డడం లేదు. కాంబినేషన్ చూపించి అప్పు తెస్తున్నారు. ఈ మాత్రం దానికి నిర్మాత ఎందుకు? మనమే చేసుకోలేమా? మన కష్టానికి వచ్చే లాభం మనమే తినలేమా? '' అనే రీతిలో మార్గదర్శకత్వం చేస్తున్నారట.

అసలే ఆ డైరక్టర్ కు అంటే సినిమా మార్కెటింగ్ లో అనుభవం వుంది. ఆయన సినిమాల హక్కులను తనకు కావాల్సిన వాళ్లకే విక్రయించేలా చేస్తారని, ఆ మార్కెటింగ్ వ్యవహారాలు ఆయనే చూసుకుంటారని టాక్. అందువల్ల ఆయన అలా అనివుండొచ్చు. కానీ మిగిలిన టాప్ డైరక్టర్లు ఇలాంటి వాటి జోలికి వెళ్లరు. పైగా ఇక్కడ అసలు విషయం  మిస్ అయిపోతున్నారు. సినిమా తేడా కొడితే నిర్మాతలు ఎగిరిపోతున్నారు. గతంలో ఎన్నో సినిమాలు ఈ విషయాన్ని ప్రూవ్ చేసాయి. ఆ సినిమాలకు పని చేసిన వాళ్లంతా పెద్ద డైరక్టర్లే.

అందువల్ల నిర్మాతలు లేకుండా అన్నీ మనమే చేసేసుకుందా అనుకుంటే అత్యాశే అవుతుంది. అడియాశే మిగులుతుంది.

ఆ విషయంపైనే అమిత్ షా ని కలుస్తున్నాం

తిట్టే వాళ్ళకే ఎక్కువ పెట్టాలి

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?