రన్ రాజా రన్ హిట్ కావడం టాలీవుడ్ లో మీడియం రేంజ్ డైరక్టర్లకు కాస్త ఇబ్బందిగానే వుంది. టాప్ డైరక్టర్ల సంగతి అలా వుంచితే, మీడియం రేంజ్ లో రాను రాను కాంపిటీషన్ పెరిగిపోతోంది. ఒక్క సినిమాతోనే రాత్రికి రాత్రి ఇండస్ట్రీలో టాక్ గా మారిపోతున్నారు. ఒక్కో సినిమాతో ఒక్కో డైరక్టర్ పుట్టకొస్తున్నారు. ఎంతమంది వచ్చినా చోటు వుంది అనుకునే వరకు ఓకె.
కానీ నిర్మాతలు..హీరోలు..కావాలి కదా..అక్కడ కాంపిటీషన్ పెరిగిపోతోంది. కథలు రెడీ చేసుకుంటే కాదు..ఏ హీరో డేట్స్ దొరుకుతాయో తెలియదు..అందుకని రెండు మూడు లైన్లు సిద్ధం చేసుకోవాలి..ఏ నిర్మాత దగ్గర ఏ హీరోకి అడ్వాన్స్ లు వున్నాయో చూసుకోవాలి. ఇలా ఇప్పుడ దర్శకులకు కనిపించని బాధలు చాలా వచ్చేసాయి..
పైగా హీరోలు, నిర్మాతలు ముందుగా లక్ష, రెండులక్షలు ఇచ్చి దర్శకులను బ్లాక్ చేస్తున్నారు. రేపు..మాపు..అంటున్నారు. లైన్లు వినిపించడం..మార్పులు చేర్పులు చేయడం..హీరోలకు తీరిక చిక్కడంతోనే సమయం సరిపోతోంది. ఎప్పటికో ప్రాజెక్టు మొదలవుతుంది అనుకుంటే, కొత్త డైరక్టర్ పుట్టుకు వస్తున్నాడు..దీంతో మరింత పోటీ..పైకి ఎన్ని బింకాలు పోయినా, ఇదే అసలు సంగతి