Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

డబ్బింగ్ రూమ్ లోకి డైరక్టర్ కు నో ఎంట్రీ

డబ్బింగ్ రూమ్ లోకి డైరక్టర్ కు నో ఎంట్రీ

శివమ్ సినిమా చూసిన వాళ్లందరికీ ఓ డవుట్ వస్తుంది. పోసాని క్యారెక్టర్..కొడుకు అని చెప్పకునే రామ్ క్యారెక్టర్ వెనుక తుపాకి పట్టుకుని ఎందుకు వెంటబడుతుంది..ఆ సందేహం తీరకుండానే సినిమా ముగిసిపోతుంది. దీనికి సంబంధించి చిత్రమైన సంగతి టాలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది. 

ఈ సందేహానికి సమాధానం, పోసాని క్యారెక్టర్ ద్వారా చెప్పించాల్సి వుందట. అయితే డబ్బింగ్ చెప్పేటపుడు, ఈ డైలాగ్ చేర్చాల్సి వుందట. దానికి సంబంధించి వేరే సీన్ లేనందున, డబ్బింగ్ లో కవర్ చేయాలని దర్శకుడు డిసైడ్ అయ్యాడట. అయితే ఏమయిందో ఏమో, ఎక్కడ చెడిందో ఏమో కానీ సినిమాకు దర్శకుడిని పెట్టుకున్నారు కానీ ఇన్ వాల్వ్ మెంట్ అంతా హీరో, నిర్మాతలదేనట. డబ్బింగ్ రూమ్ లోకి కూడా దర్శకుడిని రానివ్వలేదని టాక్. 

దాంతో ఆ డైలాగ్ చేర్చకుండానే డబ్బింగ్ ముగిసిపోయింది..సినిమా విడుదలైపోయింది. ఫలితం సంగతి తెలిసిందే. ఇంతకీ స్రవంతి రవికిషోర్ కు దర్శకుడు శ్రీనివాసరెడ్డికి ఎక్కడ చెడింది..అది కాస్తా సినిమాను ఎందుకు చెడిపింది? ఈ సందేహాలకు సమాధానం లేదు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?