ధుర్యోధనుడిగా బాలయ్య

సస్పెన్స్ వీడిపోయినట్లే. ఎన్టీఆర్ బయోపిక్ తొలిరోజు షూట్ లో హీరో బాలయ్య ధుర్యోధనుడి గెటప్ లో కనిపించబోతున్నారని తెలుస్తోంది. బయోపిక్ లో బాలయ్య సుమారు యాభై అరవై గెటప్ ల్లో కనిపిస్తారు. Advertisement ఈ…

సస్పెన్స్ వీడిపోయినట్లే. ఎన్టీఆర్ బయోపిక్ తొలిరోజు షూట్ లో హీరో బాలయ్య ధుర్యోధనుడి గెటప్ లో కనిపించబోతున్నారని తెలుస్తోంది. బయోపిక్ లో బాలయ్య సుమారు యాభై అరవై గెటప్ ల్లో కనిపిస్తారు.

ఈ విషయాన్ని బాలయ్యే గతంలో చెప్పారు. కృష్ణుడు, రాముడు దగ్గర నుంచి, బొబ్బిలిపులి, సర్దార్ పాపారాయుడు వరకు, ఎన్టీఆర్ చేసిన అనేక పాత్రల్లోంచి కీలకమైన వాటిని ఎంచుకుని, బాలయ్య చేయబోతున్నారు.

అయితే తొలి రోజు షూటింగ్ కు బాలయ్య ఏ గెటప్ లో వస్తారు? ఇది అభిమానులకు ఆత్రుతగా వుంది. కృష్ణుడిగా వస్తాడా? రాముడిగా వస్తాడా? లేక యంగ్ ఎన్టీఆర్ మాదిరగా కనిపిస్తాడా? అన్నది పాయింట్.

అయితే అందుతున్న సమాచారం ప్రకారం బాలయ్య, దుర్యోధనుడి గెటప్ లో రాబోతున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ కు ఎన్ని పాత్రలు వేసినా, రారాజు సుయోధనుడి పాత్ర అంటే అత్యంత ఇష్టం.

అందుకే బాలయ్య ఆ గెటప్ లోనే ముహుర్తం షాట్ ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. గతంలో స్టేజ్ మీద ఓ సారి బాలయ్య ఆ గెటప్ లో కనిపించారు. ఇప్పుడు రారాజు సుయోధనుడిగా బాలయ్య కనిపించి, ఆ స్టిల్స్ బయటకు వస్తే, ఇక అభిమానుల ఆనందానికి అవధులు వుండవు.

ఎన్టీఆర్ బయోపిక్ ఓపెనింగ్ ఫొటోస్ కోసం క్లిక్ చేయండి