ఏడుకోట్లకు జయమ్ము…

తొలిసారి ఫుల్ ఫ్లెడ్జ్ హీరోగా సినిమా చేస్తున్నాడు కమెడియన్ శ్రీనివాస రెడ్డి. తన దైన టైమింగ్ తో కమెడియన్ గా మంచి పేరు తెచ్చుకున్న శ్రీనివాస రెడ్డి గీతాంజలిలో దాదాపు హీరో లాంటి రోల్…

తొలిసారి ఫుల్ ఫ్లెడ్జ్ హీరోగా సినిమా చేస్తున్నాడు కమెడియన్ శ్రీనివాస రెడ్డి. తన దైన టైమింగ్ తో కమెడియన్ గా మంచి పేరు తెచ్చుకున్న శ్రీనివాస రెడ్డి గీతాంజలిలో దాదాపు హీరో లాంటి రోల్ నే చేసాడు. ఆ తరువాత ఇప్పుడు పక్కా రెగ్యులర్ ఫార్మాట్ హీరోగా కనిపించబోతున్నాడు. ఈ సినిమా సాంగ్ ఒకటి ఆ మధ్య విడుదల చేసారు. దాంతో ఆ సినిమా మీద అందరి దృష్టి కాస్త పడింది. ఇప్పుడు ఆ సినిమా టోటల్ గా ఏడు కోట్ల అవుట్ రేట్ కు అమ్ముడుపోయింది. ఇటీవలే ఇంకొక్కడు సినిమాను అందిస్తూ టాలీవుడ్ లోకి  ఎంటర్ అయిన కృష్ణారెడ్డి, జయమ్ము నిశ్చయమ్మురా సినిమాను చూసి, టోటల్ హక్కులను ఏడుకోట్లకు తీసేసుకున్నారు. అంటే ఇక నిర్మాత కమ్ దర్శకుడు శివరాజ్ కనుమూరి పంట పండినట్లే. సినిమాకు ఎంత ఖర్చయి వుంటుంది. శ్రీనివాసరెడ్డి, పూర్ణిమ, మరి కొందరు కామెడీ ఆర్టిస్టుల ప్యాడింగ్. కథ, స్క్రీన్ ప్లే నిర్మాతనే. టెక్నికల్ టీమ్ కూడా మరీ ఎక్కువ కాస్ట్ ఏమీ కాదు.  సినిమా శాటిలైట్ తో సహా అన్ని హక్కులు వున్నాయి కాబట్టి కొన్న కృష్ణా రెడ్డికి కూడా వర్కవుట్ అవుతుందనే అనుకోవాలి. ఏమయినా హీరోగా తొలి సినిమానే ఈ రేంజ్ లో వుండడం శ్రీనివాస రెడ్డికి లక్కీనే.