మాస్ హీరోల సినిమాల వస్తున్నాయంటే అభిమానుల తమ సృజన అంతా చూపించేస్తారు. వాళ్లే టీజర్లు తయారుచేస్తారు..వాళ్లే ఫస్ట్ లుక్ లు తయారు చేస్తారు. అసలు వాటికి తీసిపోనట్లు వుండేలా తయారుచేసి వాటిని విడుదల చేస్తారు. అలాగే తమ హీరో ఎలాంటి డైలాగులు చెబితే బాగుంటుందో కూడా ఊహించి ప్రచారం చేస్తారు.
ఇప్పుడు టెంపర్ సినిమాలో వంటూ కొన్ని డైలాగులు ప్రచారంలోకి వచ్చాయి. నిజమో కాదో అన్న సంగతి అలా వుంచితే మాంచి పవర్ పుల్ గానే వున్నాయి. ముఖ్యంగా వెన్నుపోటు డైలాగు అదిరింది. ఎక్కడ తగుల్తుందో? కానీ ఈ టైమ్ లో ఎన్టీఆర్ ఈ డైలాగు చెబుతాడా అన్నది ఆలోచిస్తే మాత్రం ఇవి సినిమాలోవా..అభిమానుల క్రియేషనా అన్న అనుమానం కలుగుతుంది. ఇవీ ఆ డైలాగులు.
…
నేను కంట్రోల్ తప్పి కొడితే కంట్రోల్ రూమ్ వరకే పోతావ్..నేను కాన్ఫిడెంట్ గా కొడితే కంటికికనిపించకుండా పోతావ్..అదే నేను నాకున్న టెంపర్ తో కొడితే, కోమానో, దాన్నేమంటారో..అక్కడికి పోతావ్..గుర్తుందిగా..నా పేరు దయ..ఇన్ స్పెక్టర్ దయ..
..
నువ్వు ఎలిమినేట్ అవ్వడానికి ఎలక్షన్లు ఎందుకురా..నా చేతిలో ఎన్ కౌంటర్ అవకుండా చూసుకో
..
రేయ్..నువ్వు పాత సినిమాల్లో విలన్ డైలాగులు చెప్పకు..నేను పాత సినిమాల్లో ఎన్టీఆర్ లా ఎన్టీఆర్ లా మారాల్సి వస్తుంది. నేను మాట్లాడేటప్పుడు కౌంటర్ వేస్తే, సెంటర్ లో ఎన్ కౌంటర్ చేస్తా.
…
రేయ్ దేవుడు మనుషులకి బ్రెయిన్ వెనక వైపు, హార్ట్ మందు వైపు ఎందుకు ఇస్తాడో తెలుసా, గుండెపోటును కాదు వెన్నుపోటు తగలకుండా చూసుకోమని.
,…
కరెంట్ ను ఆంపైర్లలో, వోల్టోజీని ఓల్ట్స్ లో, డిస్టాన్స్ ని మీటర్లలో, కొలుస్తారని చిన్నప్పుడెప్పుడో మా బడిలో పంతులు చెప్పేవాడు..కానీ నా టెంపర్ ను ఎలా కొలవాలో చెప్పలే