నిగ్గుదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని అంటాడు వెనకటికి ఓ పాటలో. మనమంతా లాంటి మంచి సినిమా తీస్తే 15కోట్లు నష్టం. జీఎస్టీ అనే 18నిమషాల బూతు సినిమా తీస్తే తొమ్మిది నుంచి పది కోట్లు లాభం. అందరూ రామ్ గోపాల్ వర్మ పిచ్చోడు, పెర్వెర్టెడ్ అనుకుంటున్నారు. అదేం కాదు. ఆయనకు డబ్బులు చేసుకునే మార్గం తెలిసింది.
ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న దాని ప్రకారం ఆర్జీవీనే అమెరికాలోని తన సన్నిహితుల సహాయంతో కొత్త కంపెనీ ఫ్లోట్ చేసి, కేవలం 65లక్షల అతి తక్కువ ఖర్చుతో జీఎస్టీ సినిమాను తీసేసారట. 18నిమషాల సినిమాకు అయిన ఖర్చులో అథిక భాగం నటించిన పోర్నోస్టార్ కు, సంగీతం అందించిన కీరవాణికి మాత్రం చెల్లించారు.
కానీ పైరసీలు, డౌన్ లోడ్ లు అవన్నీ పక్కన పెడితే, ఇప్పటికి అధికారికంగా 150వరకు అటు డాలర్లలోనో, ఇటు రూపాయల లెక్కనో చెల్లించి చూసిన వారితో లెక్కలు కడితే పది కోట్ల వరకు వచ్చిదంట.
అందుకే ఆర్జీవీ ఇప్పుడు జీఎస్టీ 2ప్రకటించేసాడు. ఎంత కాంట్రావర్సీ చేయాలో అంతా చేసి, జనాలు ఎగబడేలా చేసిన దాని ఫలితం ఈ ఆదాయం. అది రెండో పార్ట్ కు వుంటుందా అంటే వుంటుదనే అనుకోవాలి. ఎందుకంటే ఇండియాలో పోర్న్ చూసేవారి సంఖ్య ప్రపంచంలోనే మూడో స్థానంలో వుందని లెక్కలు చెబుతున్నాయి. ఇలాంటి వారికి 150ఎక్కువేమీ కాదు.
అదే కనుక, మనమంతా సినిమాకు కూడా వంద రూపాయిలు చెల్లించి చూడండి అని పెట్టివుంటే ఎంత మంది చూసేవారో? నెట్ లో ఇప్పుటికి ఫ్రీగా 4.3 మిలియన్ల మంది చూసారు. అంటే ఎన్ని కోట్లు రావాలి? ఇబ్బడిముబ్బడిగా లాభాలురావాలి. కానీ అలా అని వంద కాదు యాభై రూపాయలు పెట్టినా మన జనాలు నెట్ లో చెల్లించి చూస్తారా? అనుమానమే.