Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఏ తీరాలకీ కెలుకుడు రామ్?

ఏ తీరాలకీ కెలుకుడు రామ్?

నేను శైలజ సినిమా విజయాన్ని హీరో రామ్ ఎంజాయ్ చేస్తున్నట్లా లేదా అని అనుమానంగా వుంది. ఎందుకంటే ఈ విజయంపై వార్తలు షేర్ చేసుకోవాల్సిన సమయంలో ఓ చానెల్ తో అనసరపు రగడను పెద్దది చేసుకుంటున్నాడేమో రామ్ అనిపిస్తోంది. 

నేను శైలజ విషయంలో రామ్ కు టీవీ 5 చానెల్ కు నడుమ ఎక్కడో కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది.సరే సినిమాకు మంచి టాక్ వచ్చింది..హిట్ అయింది కాబట్టి, ఇక రామ్ ఆ విషయాన్ని అక్కడితో వదిలేస్తే బాగుండేది. కౌంటర్ అంటూ లేకుంటే ఇక ఎన్ కౌంటర్ వుండదు కదా. కానీ ట్విట్టర్ లో ట్వీట్ లు చేయడం ప్రారంభించాడు ఛానెల్ పేరుచెప్పకుండా. 

పోనీ ఈ రగడ అక్కడితో ఆగిందా అంటే..ఆ చానెల్ ఓ ఉద్యోగిని పనిలోంచి తీసేసింది. చానెల్ లో నేను శైలజ సినిమాకు సంబంధించి ప్రసారమైన ఓ కార్యక్రమాన్ని ఉద్దేశ పూర్వకంగా యూ ట్యూబ్ లోకి వెళ్లాకనో, వెళ్లకుండానో..మొత్తానికి ఏదో చేసాడన్న వార్త వినిపిస్తోంది. మరి ఏం చేసాడో తెలియదు కానీ, తీసేయడం జరిగింది. సరే ఓ సంస్థ తన ఉద్యోగిని క్రమశిక్షణా వ్యవహారం కింద తీయడం అన్నది చాలా సులువైన సంగతి. ఎందుకంటే ప్రయివేటు ఉద్యోగాలే అంత..తుమ్మితే ఊడిపోయే ముక్కులు. 

ఆ ఉద్యోగి రామ్ ఫ్యాన్ అంట..ఆయనకు ఈ విషయం చెప్పినట్లున్నాడు. వెంటనే మరో ఉద్యోగం దొరికే వరకు తాను జీతం ఇస్తానని హామీ ఇచ్చాడు. మంచితే ఓ అభిమాని కోసం హీరో ఇలా ముందుకు రావడం మెచ్చుకోదగ్గ సంగతే.కానీ రామ్ అక్కడితో ఊరుకోలేదు..ఈ విషయాన్ని ఛానెల్ పేరుతో సహా ట్విట్టర్ కు ఎక్కించాడు. మరి సహజంగానే ఆ ఛానెల్ ఏదో ఒకటి కౌంటర్ ఇస్తుంది. తప్పదు కదా.

. @naveen_tv5 will get an apology from Me in person & he will collect his salary from My Office every month until he finds a new job. #Love

కానీ ఇదేమంత ఆరోగ్యకరమైన పద్దతి కాదు..రామ్ ఇండస్ట్రీలో వుండాల్సిన వ్యక్తే. ఈ సినిమాతో అయిపోలేదు. ఇంకా సినిమాలు చేయాలి. మీడియాతో మంచి సంబంధాలు కలిగి వుండాలి. రామ్ సైలెంట్ గా ఆ ఉద్యోగిని ఆదుకుని వుంటే వేరే సంగతి. ఇలా ఓపెన్ చేయడంవల్ల ఆ ఉద్యోగికి మరొకరు చాన్స్ ఇవ్వడం కూడా కష్టం కావచ్చు. 

పైగా తన వల్ల అన్యాయం జరిగిందని రామ్ ఆదుకోవాలి అనుకుంటే,ఇటీవల ఫ్లాప్ అయిన సినిమాలు, వాటి వల్ల నష్టపోయిన బయ్యర్లు చాలా మందే వున్నారు. వారిని కూడా ఆదుకోవచ్చు కదా అనే కౌంటర్ ప్రశ్న టాలీవుడ్ లో వినిపిస్తోంది.

పైగా రామ్ బాగానే వుంటాడు..ఛానెల్ బాగానే వుంటుంది..మధ్యలో నలిగిపోయేది ఉద్యోగులే. గతంలో దాసరికి ఈనాడుకు, బాలసుబ్రహ్మణ్యంకు కృష్ణకు, ఇలా చాలా మంది నడుమ తీవ్ర విభేదాలు తలెత్తాయి..అవి..ఇప్పుడు వున్నాయా?లేనే లేవు.. అందువల్ల ఇలాంటి తగాయిదాల్లో ఉద్యోగాలు తల దూర్చి ఉద్యోగాలు పోగొట్టుకోవడం అంత తెలివితక్కువతనం మరోటి వుండదు. 

స్రవంతి రవికిషోర్ అనుభవం పండిన వారు కాబట్టి, ఈ కెలుకుడుకు ఫుల్ స్టాప్ పెట్టించడం ఉత్తమం.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?