ఈటీవీ నుంచి కొత్త చానెళ్లు

ఈటీవీ నుంచి కొత్త చానెల్ వచ్చి చాలా కాలం అయింది. ప్రస్తుతం ఈటీవీ, ఈటీవీ 2 అదే తెలంగాణ కూడా వున్నాయి. ఇప్పుడు మిగిలిన చానెళ్ల మాదిరిగా స్పెషలైజ్డ్ చానెళ్లు ప్రారంభిస్తున్నారని వినికిడి.  …

ఈటీవీ నుంచి కొత్త చానెల్ వచ్చి చాలా కాలం అయింది. ప్రస్తుతం ఈటీవీ, ఈటీవీ 2 అదే తెలంగాణ కూడా వున్నాయి. ఇప్పుడు మిగిలిన చానెళ్ల మాదిరిగా స్పెషలైజ్డ్ చానెళ్లు ప్రారంభిస్తున్నారని వినికిడి.  

ఈటీవీ ప్లస్, ఈటీవీ లైఫ్, ఈటీవీ సినిమా, ఈ టీవీ అభిరుచి ఛానల్స్‌ అంటూ నాలుగు చానెళ్లు ప్రారంభిస్తారని వినికిడి. ఇందులో ప్లస్ ను యువజన కార్యక్రమాలకు, లైఫ్ ను సకుటుంబ కార్యక్రమాలకు కేటాయిస్తారు. సినిమాచానెల్ మిగిలిన మూవీ చానెళ్ల మాదిరిగా రౌండ్ ది క్లాక్ సినిమాలు ప్రసారం చేస్తుంది. 

అభిరుచి ఛానెల్ ఫుడ్ అండ్ నూట్రిషన్ కార్యక్రమాలకు కేరాఫ్ అడ్రస్ అవుతుంది. బహుశా ఈ నెలాఖరు నుంచి ఈ కార్యక్రమాల ప్రసారం లేదా ప్రచారం ప్రారంభించే అవకాశం వుంది.