ఎవరి స్క్రిప్ట్ ఎవరికి రాసి వుందో?

దర్శకులు కష్టపడి స్క్రిప్ట్ తయారు చేస్తారు. కానీ దానిని గుర్తించడం అది మంచి సినిమా అవుతుందని నమ్మకం వుంచడం అంతమందికీ సాధ్యంకాదు. దర్శకుడు గౌతమ్ తిన్ననూరి దాదాపు రెండు ఏళ్లు కష్టపడి రాసుకున్న స్క్రిప్ట్…

దర్శకులు కష్టపడి స్క్రిప్ట్ తయారు చేస్తారు. కానీ దానిని గుర్తించడం అది మంచి సినిమా అవుతుందని నమ్మకం వుంచడం అంతమందికీ సాధ్యంకాదు. దర్శకుడు గౌతమ్ తిన్ననూరి దాదాపు రెండు ఏళ్లు కష్టపడి రాసుకున్న స్క్రిప్ట్ జెర్సీ. ఆ స్క్రిప్ట్ అతగాడి దగ్గర వుందని ఇండస్ట్రీలో ఎక్కువ మందికే తెలుసు. కానీ ఎవరూ దానిని అంత సులువుగా యాక్సెప్ట్ చేయలేకపోయారు.

హీరో బెల్లంకొండ శ్రీనివాస్ కు కూడా ఈ స్క్రిప్ట్ వినిపించారు. ఆయినా ఎందుకో మెటీరియలైజ్ కాలేదు. మళ్లీ రావా సినిమా చూసిన మరుక్షణం నిర్మాత ఎన్వీ ప్రసాద్ అడ్వాన్స్ ఇచ్చారు. ఆయన కూడా భారీ నిర్మాతే. కానీ కొన్ని సినిమాలు ఫెయిల్ అయి, సమస్యల్లో వున్నారు.

దాంతో సితార ఎంటర్ టైన్ మెంట్స్ నాగవంశీకి కథ చెప్పారు. విన్న మరుక్షణం కనెక్ట్ అయిపోయి, నాని దగ్గరకు పంపారు. ఇరవై నిమిషాలు టైమ్ ఇచ్చిన నాని, కథ స్టార్ట్ కాగానే అలా అలా మొత్తం వినేసారు. మరుక్షణం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు. దాంతో అడ్వాన్స్ ఇచ్చిన ఎన్వీ ప్రసాద్ దగ్గర అనుమతి తీసుకుని సితారలో సినిమా ఎక్కించారు. ఆ విధంగా జెర్సీ సినిమా యూనిట్, హీరో ఫిక్స్ అయ్యారు.

ఇదిలావుంటే గౌతమ్ ఈ సినిమాను మూడు గంటలకు పైగా ఫుటేజ్ తీసారు. దాన్ని ఎలా తగ్గించాలన్నా స్క్రిప్ట్ అమితంగా ప్రేమించిన గౌతమ్ అంతగా ఇష్టపడలేదని బోగట్టా. ఎడిటర్ నవీన్ నూలి కష్టపడి ఇరవై నిమిషాలకు పైగా ఎపిసోడన్ ను ఓ సాంగ్ లో ఏడెనిమిది నిమిషాలు తెచ్చారు. అలాగే అనే సీన్లను వాటి ఎసెన్స్ చెడకుండా తగ్గించుకు వచ్చారు. ఈ విషయంలో నిర్మాతల మాట కన్నా, నవీన్ నూలి పనితనానికి గౌతమ్ తల వొగ్గినట్లు బోగట్టా.

ఒక్క సినిమా చేసిన దర్శకుడిని నమ్మి, నాని హీరోగా వున్న ధైర్యంతో జెర్సీ సినిమాకు చాలా ఖర్చుచేసారు. విదేశీ క్రికెట్ టీమ్ మొత్తాన్ని హైదరాబాద్ రావడానికి ఒప్పించడం, వాళ్లకు సదుపాయాలు కల్పించడం ఇవన్నీ చాలా వ్యయం, శ్రమకు దారితీసాయి. అలాగే ఎల్ బి స్టేడియంలో క్రికెట మ్యాచ్ చిత్రీకరణకు బోలెడు ఖర్చుచేయాల్సి వచ్చింది.

నైట్ మ్యాచ్ చిత్రీకరణకు లైటింగ్ నిర్వహణకే బోలెడు ఖర్చయింది. అన్నీ అధిగమించి జెర్సీ ధియేటర్లోకి వచ్చింది. జనాల ప్రశంసలు పొందుతోంది. ఇక గౌతమ్ కు ఇక సమస్య లేదు. అందరూ ఆఫర్లు ఇస్తారు. స్క్రిప్ట్ లు వింటారు. రిస్క్ లు చేస్తారు. 

మేము చాలా రిస్క్ చేసాం.. నిఖిల్, లావణ్య ఫన్నీ ఇంటర్వ్యూ

నా మనసులో ఏది ఉంటే అదే చేస్తా.. మంచివాళ్ళకే సపోర్ట్