ఎవరికీ లేని హడావుడి బోయపాటికి?

రోజులు మారాయి. జనం అంతకన్నా మారారు. ప్రతీదీ విశ్లేషించి చూడడం అన్నది జనాలకు అలవాటైపోయింది. అలాంటిది ఓ సినిమా వెయ్యి రోజుల పాటు ఓ మారుమూల ఊర్లో ఆడింది అంటే జనం ఏమనుకుంటారు. ఎంత…

రోజులు మారాయి. జనం అంతకన్నా మారారు. ప్రతీదీ విశ్లేషించి చూడడం అన్నది జనాలకు అలవాటైపోయింది. అలాంటిది ఓ సినిమా వెయ్యి రోజుల పాటు ఓ మారుమూల ఊర్లో ఆడింది అంటే జనం ఏమనుకుంటారు. ఎంత ఇష్టమైనా ఇలాంటి విషయాల్లో కాస్త సైలెంట్ గా వుండాలి.

బాహుబలి సీడెడ్ బోర్డర్ లోని ఓ ప్రాంతంలో భయంకరమైన కలెక్షన్లతో ఆడింది. కానీ 48 రోజుల తరువాత థియేటర్లలో లేదు. ఎందుకంటే ఇక అంత కలెక్షన్లు లేవు. తీసేసారు.

లెజెండ్ సినిమా విడుదలై వెయ్యి రోజులవుతోంది. డజను సార్ల వరకు టీవీలో ఇచ్చేసారు. అది వెయ్యి రోజులు ఓ థియేటర్లో అభిమానంతో వుంచితే వుంచి వుండొచ్చు. తప్పు లేదు. ఆ థియేటర్ యజమాని ఆనందం అది. కానీ దానికి హడావుడి ఎందుకు? 

లెజెండ్ 1000 రోజుల హడావుడి వెనుక వున్నది దర్శకుడు బోయపాటి అని టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అసలు ఆ సినిమా వెయ్యి రోజుల హడావుడి కానీ, ప్రెస్ నోట్లు పత్రికలకు ఇస్తున్నారన్న సంగతి కానీ అసలు నిర్మాతలకే తెలియదని టాక్. కేవలం బోయపాటి తనకోసం ఈ హడావుడి చేస్తున్నారని తెలుస్తోంది.

మరోపక్క ఆ ధియేటర్లో అంతగా నడకలో లేదని, వేస్తే వేసినట్లు, లేదంటే ఆపినట్లు అలా వదిలేసారని గుసగుసలు వినిపిస్తున్నాయి.  బాలయ్య పై అభిమానంతో ఆ థియేటర్ ను అలా లెజెండ్ కోసం వదిలేసి వుండొచ్చు. ఫ్యాన్స్ దాని సెలబ్రేట్ చేసుకోవచ్చు. కానీ బోయపాటి లాంటి డైరక్టర్ దాన్ని హడావుడి రేంజ్ కు తేవడం అవసరమా అన్న క్వశ్చన్లు వినిపిస్తు్న్నాయి ఇండస్ట్రీలో.