ఎవరు అనుకుంటే వాళ్లకే ఫ్లాపులు

బన్నీ కి ఎప్పటి నుంచో తమిళ మార్కెట్ లోకి వెళ్లాలనే తపన వుంది. మలయాళ మార్కెట్ లో కోటి రూపాయల నుంచి కోటిన్నర రేంజ్ లో మార్కెట్ వుంది. తమిళనాట కోటి రూపాయల రేంజ్…

బన్నీ కి ఎప్పటి నుంచో తమిళ మార్కెట్ లోకి వెళ్లాలనే తపన వుంది. మలయాళ మార్కెట్ లో కోటి రూపాయల నుంచి కోటిన్నర రేంజ్ లో మార్కెట్ వుంది. తమిళనాట కోటి రూపాయల రేంజ్ లోనే వుంది. బన్నీకే కాదు, మహేష్ కు అయినా కూడా. కానీ మార్కెట్ సంగతి పక్కన పెడితే మలయాళంలో బన్నీకి అభిమానులు, క్రేజ్ వుంది. 

అదే మాదిరిగా  సరైన తెలుగు తమిళ ఉభయ భాషా చిత్రం చేసి, తమిళ నాట కూడా ఇంతో అంతో క్రేజ్ తెచ్చుకోవాలన్నది బన్నీ ఆలోచన. ఇది ఈనాటిది కాదు. ఏనాటిదో. అయితే ఆ ప్రయత్నానికి అడుగు అడుగునా విఘ్నాలే ఎదురవుతున్నాయి.

గతంలో ఏకంగా ఒక సినిమాకు ఓపెనింగ్ కూడా తెగ హడావుడిగా చేసేసారు చెన్నయ్ లో. కానీ ఆ సినిమా ఇప్పటికీ ఎక్కడ వుందో తెలియదు. లింగుస్వామితో సినిమా చేయాలనుకున్నారు. ఆయన ఫ్లాపుల్లో ఇరుక్కుని, తమిళనాటే సరైన సినిమా లేకుండా వున్నారు. మురుగదాస్ తో సినిమా పక్కా అని ఆ మధ్య అనుకున్నారు. ఇప్పుడు ఆయన కూడా ఫ్లాపుల్లో పడ్డారు. దర్బార్ సినిమా అనుకున్న మేరకు నడవలేదు.

మరి ఇప్పుడు మురుగదాస్ తో బన్నీ చేసే ఆలోచనలో వున్నట్లు లేదు. ప్రస్తుతానికి సుకుమార్, ఆ తరువాత వేణు శ్రీరామ్ లేదా సురేందర్ రెడ్డి అనే ఆలోచనలో వున్నారు. వేణు శ్రీరామ్ వ్యవహారం కూడా పింక్ తరువాత డిసైడ్ అవుతుంది.

మొత్తం మీద బన్నీ తమిళ ప్రవేశానికి ఏవో విఘ్నాలు వున్నట్లున్నాయి.

ఇప్పుడు చల్లారిందా