హీరో రామ్ చరణ్ కోట్లు రెమ్యూనిరేషన్ గా తీసుకుంటూ వుండొచ్చు. కానీ ఇప్పుడు గెల్చుకున్న 25 లక్షలు వేరే. మీలో ఎవరు కోటీశ్వరులు అలాంటి గేమ్ షో లో ఆడి గెల్చుకున్నాడు.
ఎన్టీఆర్ హోస్ట్ గా ఆగస్టు 16 నుంచి ప్రసారం కాబోతోంది జెమిని ఛానెల్ లో ఈ గేమ్ షో. తొలి ఎపిసోడ్ రామ్ చరణ్ తోనే.
ఈ షోలో ప్రశ్నల ఫార్మాట్, బహుమతి రెట్టింపు అవుతూ వెళ్లి, కోటి రూపాయలకు చేరడం అన్నది ప్రేక్షకులకు తెలిసిందే. ఈ ఫార్మాట్ లో రామచరణ్ కొన్ని ప్రశ్నలకు వరుసగా సమాధానాలు చెప్పి 25 లక్షలు గెల్చుకున్నట్లు తెలుస్తోంది.
ఆర్ఆర్ఆర్ హీరోల కాంబినేషన్ లో పిక్చరైజ్ చేసిన ఈ తొలి ఎపిసోడ్ ఆగస్టు 16న ప్రసారం అవుతుంది. అక్కడి నుంచి వరుసగా ఆడియన్స్ ఆడే ఎపిసోడ్ లు ప్రసారం అవుతాయి.
ఇప్పటికి 16 ఎపిసోడ్ లు పిక్చరైజ్ చేసారు. ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ షూటింగ్ కు ఉక్రయెన్ వెళ్లి వచ్చాక మళ్లీ చిత్రీకరణ వుంటుంది.