Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఎక్స్ క్లూజివ్ - నానితో రాహుల్

ఎక్స్ క్లూజివ్ - నానితో రాహుల్

టాక్సీవాలా డైరక్టర్ రాహుల్ సాంకృత్యన్ మాంచి చాన్స్ కొట్టేసారు. హీరో నానితో సినిమా చేయబోతున్నారు. విజయ్ దేవరకొండతో గీతా 2 బ్యానర్ లో బన్నీవాస్ నిర్మాతగా టాక్సీవాలా సినిమా చేసిన రాహుల్ ఇప్పుడు సితార ఎంటర్ టైన్మెంట్స్ లో నాని హీరోగా సినిమాకు సైన్ చేసారు.

టాక్సీవాలా తరువాత ఇప్పటి వరకు రాహుల్ సినిమా చేయలేదు. గీతా 2 లోనే మరో సినిమా చేసేందుకు చర్చలు సాగుతున్న నేపథ్యంలో నానితో డీల్ ఫైనల్ అయిపోయింది. ప్రస్తుతం చేస్తున్న ఇంద్రగంటి సినిమా పూర్తి కావచ్చింది. ఆ తరువాత డైరక్టర్ శివనిర్వాణ సినిమా అనంతరం ఈ ప్రాజెక్టు వుంటుంది.

రాహుల్ మొదట్లో ది ఎండ్ అనే సినిమా చేసాడు. అది కమర్షియల్ సక్సెస్ కాకున్నా, అతన్ని ఇండస్ట్రీకి పరిచయం చేయగలిగింది. ఆ తరువాత టాక్సీవాలా చేసి హిట్ కొట్టాడు. కానీ మళ్లీ వెంటనే సినిమా ఎక్కలేదు. ఇప్పటికి ఫైనల్ అయి, ప్రాజెక్టు చేతిలోకి వచ్చింది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?