Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఎక్స్ క్లూజివ్-ఆర్జీవీ బయోపిక్

ఎక్స్ క్లూజివ్-ఆర్జీవీ బయోపిక్

రచయిత, కవి జొన్నవిత్తుల అన్నంత పనీ చేస్తున్నారు. ఆర్జీవీ బయోపిక్ తీయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ముల్లును ముల్లుతోటే తీయాలి అన్నట్లుగా, అందరి మీద సినిమాలు తీసే ఆర్జీవీకి సినిమాతోనే చెక్ చెప్పాలని ఆయన డిసైడ్ అయ్యారు. ఆర్జీవీ క్యారెక్టర్ పోషించే నటుడిని కూడా పట్టేసారు.

దాదాపు ఆర్జీవీ మాదిరిగానే వుండే వ్యక్తి ఒకరు మధ్యప్రదేశ్ లో వున్నట్లు తెలిసి, అతన్ని కలిసి, సినిమాకు ఒప్పించినట్లు బోగట్టా. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ సినిమా వుండొచ్చు. ఆర్జీవీ మీద పీకల లోతు కోపం, కసి వున్న పలువురు, తమ వంతు సాయం చేస్తామని ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది.

ఆర్జీవీ వ్యవహారాలు మొత్తం ఎండ గట్టేలా స్క్రిప్ట్ తయారీ జరుగుతోందని బోగట్టా. ఆర్జీవీ క్యారెక్టర్ పోషించే వ్యక్తికి ఆరెస్సెస్ నేఫథ్యం కూడా వున్నట్లు తెలుస్తోంది. ఆర్జీవీ ఉథ్తాన,పతనాలు, వితండవాదనలు, పోర్నో సినిమాలు అన్నీ ఈ బయోపిక్ లో చోటు చేసుకుంటాయని అంటున్నారు. 

చూడాలి ఈ ఆర్జీవీ బయోపిక్ వ్యవహారం ఆరంభ శూరత్వమో, కొస నెగ్గిస్తుందో?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?