Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఎక్స్ క్లూజివ్ : మహేష్ తో తమన్నా

ఎక్స్ క్లూజివ్ : మహేష్ తో తమన్నా

సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా అంటేనే వార్త. అలాంటిది ఆ సినిమాలో సమ్ థింగ్ స్పెషల్ అంటే మరింత ఇంట్రస్టింగ్ న్యూస్. మహేష్ ప్రస్తుతం చేస్తున్న సినిమా సరిలేరు నీకెవ్వరూ. ఎఫ్ 2 లాంటి బ్లాక్ బస్టర్ తరువాత దర్శకుడు అనిల్ రావిపూడి చేస్తున్న సినిమా. రష్మిక ఈ సినిమాలో కథానాయిక. అయినా మరో అట్రాక్షన్ ఏదయినా వుండాలని అనుకున్నారు డైరక్టర్ అనిల్ రావిపూడి.

అందుకే కాస్త సీనియర్ అయిన తమన్నాను తీసుకుంటున్నారు. ఐటమ్ సాంగ్ కాదు, స్పెషల్ సాంగ్ కాదు. ఇంట్రడక్షన్ సాంగ్ కు తమన్నాను తీసుకోవడం విశేషం. సినిమా ఆరంభంలో వచ్చే మహేష్ బాబు ఇంట్రడక్షన్ సాంగ్ లో తమన్నా కనిపించి, చిందేయబోతోంది,.

మహేష్ బాబు చేత మరీ మాస్ స్టెప్స్ వేయించలేరు. పైగా ఇంటిలిజెన్స్ అధికారి. అందుకే పాటలో తమన్నాను తీసుకున్నారు. ఈ చిందులేసే పని ఆమెకు వదిలేసారు. తమన్నా ఇప్పటికే రెండు మూడు స్పెషల్ సాంగ్స్ చేసింది. అన్ని సాంగ్స్ హిట్ నే.అందుకే సరిలేరు నీకెవ్వరులో తమన్నాకు ఆ చాన్స్ వచ్చింది.

వాస్తవానికి తమన్నానా? శృతి హాసన్ నా? అన్న డిస్కషన్ వచ్చినపుడు తమన్నానే ఫైనల్ ఛాయిస్ అయింది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?