ఫ్లాప్స్‌తో డిఫెన్స్‌లో పడ్డ మెగా హీరోస్‌

చిరంజీవి ఫ్యామిలీ నుంచి వచ్చిన యంగ్‌ హీరోస్‌ సాయి ధరమ్‌ తేజ్‌, వరుణ్‌ తేజ్‌కి ఇన్‌స్టంట్‌గా ఆడియన్స్‌ యాక్సప్టెన్స్‌ దొరికింది. మెగా ఫ్యాన్స్‌ వీరిద్దరినీ ఆదరించారు. లక్కీగా సాయి ధరమ్‌ తేజ్‌కి కెరీర్‌ బిగినింగ్‌లో…

చిరంజీవి ఫ్యామిలీ నుంచి వచ్చిన యంగ్‌ హీరోస్‌ సాయి ధరమ్‌ తేజ్‌, వరుణ్‌ తేజ్‌కి ఇన్‌స్టంట్‌గా ఆడియన్స్‌ యాక్సప్టెన్స్‌ దొరికింది. మెగా ఫ్యాన్స్‌ వీరిద్దరినీ ఆదరించారు. లక్కీగా సాయి ధరమ్‌ తేజ్‌కి కెరీర్‌ బిగినింగ్‌లో దిల్‌ రాజులాంటి డిపెండబుల్‌ ప్రొడ్యూసర్‌తో పొత్తు కుదిరింది. దిల్‌ రాజు సాయంతో సాయిధరమ్‌తేజ్‌ హీరోగా నిలబడిపోయాడు.

అలాగే వరుణ్‌ తేజ్‌ కూడా పేరున్న దర్శకులతో వర్క్‌ చేస్తూ నటుడిగా ప్రతి సినిమాకీ మెరుగవుతూ వచ్చాడు. సాయిధరమ్‌ తేజ్‌కి వచ్చినట్టుగా వరుణ్‌ తేజ్‌కి హిట్స్‌ రాకపోయినా, యూత్‌లో త్వరగానే పాపులర్‌ అయ్యాడు. కంచెలాంటి చిత్రాలతో అందరి ప్రశంసలు అందుకున్నాడు. అయితే లోఫర్‌, మిస్టర్‌లాంటి ఫ్లాప్స్‌తో వరుణ్‌ ఇప్పుడు డిఫెన్స్‌లో పడ్డాడు.

సాయి ధరమ్‌ తేజ్‌ కూడా తిక్క, విన్నర్‌తో డిజాస్టర్స్‌ వెనకేసుకున్నాడు. కథల ఎంపికలో ఈ ఇద్దరు హీరోలు ఖచ్చితంగా స్ట్రగుల్‌ అవుతున్నారు. తమకంటూ నమ్మకమైన మార్కెట్‌ వున్నప్పటికీ ఎలాంటి కథలు చేయాలనే కన్‌ప్యూజన్‌ ఈ యువ హీరోలని సమస్యల్లో పడేస్తోంది. సక్సెస్‌ఫుల్‌ కమర్షియల్‌ దర్శకులని నమ్ముకుంటే పని జరిగిపోతుందనే నమ్మకాన్ని అటు గోపిచంద్‌ మలినేని, ఇటు శ్రీను వైట్ల ఇద్దరూ వమ్ము చేసారు. ఈ ఫ్లాప్స్‌ నుంచి కోలుకుని మళ్లీ ట్రాక్‌ మీదకి రావడానికి ఏ తరహా కథలు ఎంచుకుంటారో చూడాలిక.