హీరోయిన్ ల పరిస్థితి దారుణంగా మారుతోంది. నిర్మాత ఇచ్చే డబ్బులకు ఆశపడితే, సినిమాల్లోనే కాదు బయటకూడా వేషాలు వేయాల్సి వస్తోంది. ఈ మధ్య సినిమాలకు ఫైనాన్స్ చేసేవాళ్ల కోరికలు కోటలు దాటుతున్నాయని వినకిడి. ఇలాంటి తాజా సంఘటన ఒకటి కృష్ణనగర్ కబుర్లలో వినిపిస్తోంది. ఓ ఫైనాన్షియర్ ఇటీవల ఓ బడా నిర్మాత ద్వారా ఓ టాప్ హీరోయిన్ ను తన గెస్ట్ హవుస్ కు రప్పించుకున్నారని వినికిడి.
ఆర్థికంగా కాస్త ఇబ్బందుల్లో పడిన ఓ బడా ప్రొడ్యూసర్, ఫైనాన్షియర్ వత్తిడి తట్టుకోలేక, ఓ టాప్ హీరోయిను అతగాడి గెస్ట్ హవుస్ కు పంపడట. సినిమాలు కాస్త తగ్గిన ఆ హీరోయిన్, నిర్మాత ఆశ చూపిన మొత్తానికి టెంప్ట్ అయి ఇందుకు ఒప్పకోక తప్పలేదట. సినిమాలో నటిస్తే కోటి ఇస్తున్న నిర్మాత, కోట్ల అప్పు వత్తిడి తప్పించుకునేందుకు అవసరమైతే ఓ కోటి ఇచ్చి హీరోయన్ ఓ రోజు అడ్జెస్ట్ చేయగలిగితే. అన్న ఆలోచనలు సాగుతున్నాయట.
శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలు అని ఊరికనే అనలేదు పెద్దలు. కానీ పొరపాటున ఏ చానెల్ వాళ్లయినా స్టింగ్ ఆపరేషన్ చేస్తే, అందరి బతుకులు బస్టాండ్ పాలైపోయే ప్రమాదం కూడా వుంది.