‘దేవర’ అయిదు నిమిషాలు కోసేసారు

ఒకటికి పదిసార్లు చూసుకుని ఫైనల్ కట్ డిసైడ్ చేసారు. అన్ని వర్క్ లు దాదాపు పూర్తయిన తరువాత కూడా చూసుకుని అయిదు నిమిషాలు కట్ చేసినట్లు విశ్వసనీయ వర్గాల బోగట్టా.

ఇటీవలి కాలంలో ప్రతి సినిమా, ముఖ్యంగా పెద్ద సినిమాల దగ్గరకు వచ్చేసరికి నిడివి సమస్యగా మారింది. ముఖ్యంగా చాలా మంది దర్శకులు అనవసరంగా నిడివి పెంచుతున్నారు. లెంగ్త్ ను హ్యాండిల్ చేయడం అన్నది చేత కావడం లేదు.

సందీప్ వంగా లాంటి కొద్ది మంది మాత్రమే ఎంత లెంగ్త్ సినిమా తీసినా జ‌నాలను కుర్చీలకు అతుక్కుని కూర్చో పెట్టగలుగుతున్నారు. సినిమా ఏమాత్రం తేడా చేసినా ముందు కామెంట్ లెంగ్త్ మీదనే పడుతోంది. సినిమా విడుదలకు ముందు దర్శకులు ఎవరెంత చెప్పినా లెంగ్త్ తగ్గించడం లేదు. విడుదల తరువాత అడ్డగా కొసేస్తున్నారు.

వచ్చేవారం విడుదలవుతున్న ఎన్టీఆర్- కొరటాల శివ సినిమా విషయంలో అలాంటి సమస్య రాకుండా ముందే జాగ్రత్త పడుతున్నారు. ఒకటికి పదిసార్లు చూసుకుని ఫైనల్ కట్ డిసైడ్ చేసారు. అన్ని వర్క్ లు దాదాపు పూర్తయిన తరువాత కూడా చూసుకుని అయిదు నిమిషాలు కట్ చేసినట్లు విశ్వసనీయ వర్గాల బోగట్టా. ఇప్పుడు సినిమా నిడివి టైటిల్స్ టు టైటిల్స్ కలిపి రెండు గంటల 42 నిమిషాలకు పరిమితం చేసారు.

ఓ పెద్ద సినిమాకు ఇది పెర్ ఫెక్ట్ నిడివి అనే చెప్పాలి. అచార్య తరువాత కొరటాల అందిస్తున్న సినిమా. పైగా పాన్ ఇండియా సినిమా. అందుకే ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు కొరటాల శివ తన వైపు నుంచి. ఎక్కడా మాట పడకుండా వుండేలా చూసుకుంటున్నారు.

4 Replies to “‘దేవర’ అయిదు నిమిషాలు కోసేసారు”

Comments are closed.