ఫ్లాప్ డైరక్టర్.. పెద్ద బ్యానర్.. నిజమేనా?

బ్రహ్మోత్సవం లాంటి అట్టర్ ఫ్లాప్ (సారీ.. డిజాస్టర్ అనాలేమో) తర్వాత పత్తా లేకుండా పోయాడు దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల. అలా చాన్నాళ్లు కనిపించకుండా పోయిన ఈ దర్శకుడు, మళ్లీ మరో ఫ్రెష్ స్క్రిప్ట్ తో…

బ్రహ్మోత్సవం లాంటి అట్టర్ ఫ్లాప్ (సారీ.. డిజాస్టర్ అనాలేమో) తర్వాత పత్తా లేకుండా పోయాడు దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల. అలా చాన్నాళ్లు కనిపించకుండా పోయిన ఈ దర్శకుడు, మళ్లీ మరో ఫ్రెష్ స్క్రిప్ట్ తో మనముందుకు రాబోతున్నాడు. అది కూడా ఓ ప్రతిష్టాత్మక బ్యానర్ పై వస్తున్నాడనేది తాజా గాసిప్.

తన మొదటి సినిమా కొత్తబంగారులోకం స్టయిల్ లో ఓ రొమాంటిక్ స్టోరీ రాసుకున్నాడు అడ్డాల. ఆస్థాన నిర్మాత దిల్ రాజు బ్యానర్ పైనే ఈ సినిమా ఉంటుందని అంతా ఊహించారు. కానీ అడ్డాలకు ఈసారి అల్లు అరవింద్ ఛాన్స్ ఇచ్చారట. అంతా కొత్తవాళ్లతో తెరకెక్కించనున్న ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మించడానికి రెడీ అవుతున్నాడట.

కథ నచ్చితే తన కాంపౌండ్ హీరోతోనే సినిమా చేయొచ్చు అల్లు అరవింద్. కానీ కొత్త ముఖాలతో తీయబోతున్న ఈ సినిమాను నిజంగానే గీతా ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మిస్తారా అనేది ఇప్పుడు పెద్ద డౌట్. ఎందుకంటే అల్లు అరవింద్ చేతిలో ఇప్పుడు మరో రెండు బ్యానర్లు ఉన్నాయి. వాటిలో ఒకటి గీతాఆర్ట్స్-2. మీడియం రేంజ్ బడ్జెట్ లో ఏమైనా సినిమాలుంటే ఆ బ్యానర్ కింద తీస్తున్నారు. 

ఇది కాకుండా తాజాగా వి-4 మూవీస్ అనే మరో బ్యానర్ కూడా పెట్టారు. యంగ్ టాలెంట్ ను ప్రోత్సహించడం కోసం పెట్టిన బ్యానర్ అది. రీసెంట్ గా ఈ బ్యానర్ పై 'నెక్ట్స్ నువ్వే' అనే సినిమా వచ్చింది. ఈ 2 బ్యానర్లను వదిలి ఏకంగా గీతాఆర్ట్స్ బ్యానర్ పై సినిమా నిర్మించడానికి రెడీ అవుతున్నారంటే, శ్రీకాంత్ అడ్డాల సినిమాలో కచ్చితంగా ఓ బడా హీరో ఉన్నట్టు అర్థం.