ఫ్లాపుల భారం అయిదారు కోట్లు

సినిమా వ్యవహారం అంతా డిమాండ్ సప్లయ్ సూత్రంపైనే ఆధారపడి వుంటుంది. డిమాండ్ వుంటే రేట్లు అమాంతం పెరిగిపోతుంది. లేదంటే రేటు తగ్గిపోతుంది. బేరం ఆడుకునే సత్తా కూడా వుండాలి. బండ్ల గణేష్ కు ఆ…

సినిమా వ్యవహారం అంతా డిమాండ్ సప్లయ్ సూత్రంపైనే ఆధారపడి వుంటుంది. డిమాండ్ వుంటే రేట్లు అమాంతం పెరిగిపోతుంది. లేదంటే రేటు తగ్గిపోతుంది. బేరం ఆడుకునే సత్తా కూడా వుండాలి. బండ్ల గణేష్ కు ఆ తెలివితేటలు అపారంగా వున్నాయి. అవసరమైతే పది పెట్టాగలడు..లేదంటే తగ్గించగలడు. ఇప్పుడు ఎన్టీఆర్, పూరి సినిమా విషయంలో అదే చేసాడు. 

సినిమా చేస్తానా,.చేయనా అన్న టెన్షన్ క్రియేట్ చేసి, కాస్త తగ్గిస్తే చేస్తా..మీతో చేసినా బాద్ షా లో ఇంతపోయింది..మీతో చేసిన ఇద్దరమ్మయిలతో  ఇంత పోయింది అని ఎలా చెప్పాడో ఏమో, మొత్తానికి అయిదారు కోట్ల మేరకు ఎన్టీఆర్, పూరి కలిసి తమ రెమ్యూనిరేషన్లు తగ్గించుకున్నారని వినికిడి. అయినా ఈ మాత్రం తగ్గడం అంటే చిన్న విషయం కాదు.