cloudfront

Advertisement


Home > Movies - Movie Gossip

ఫోరమ్ మాల్ గా బాలయ్య ఇల్లు?

ఫోరమ్ మాల్ గా బాలయ్య ఇల్లు?

ఉన్నట్లుండి ఓ గాసిప్ గుప్పుమంది. జూబ్లీహిల్స్ లోని హీరో బాలకృష్ణ ఇంటిని ఓ మాల్ నిర్మాణానికి అగ్రిమెంట్ చేసారన్నది ఆ గాసిప్. నమ్మడానికి కాస్త దూరంగానే వుందీ గాసిప్. అయితే కాస్త బలంగానే వినిపిస్తోంది. ఫోరమ్ మాల్ నిర్మాణానికి బాలయ్య ఇంటిని డెవలప్ మెంట్ ప్రాతిపదికపై ఇస్తున్నారన్నది ఆ గాసిప్ సారాంశం. ఇప్పటికే అగ్రిమెంట్ అయిపోయిందని, త్వరలో నిర్మాణం ప్రారంభిస్తారని అంటున్నారు.

నిజానికి బాలయ్య ఇంటి చుట్టుపక్కల చాలా భవనాలు కమర్షియల్ అయిపోయాయి. అలాగే చాలా ఇళ్లు రెసిడెన్షియల్ గా కూడా వున్నాయి. ఆ ఇంటి ప్రాంతంలోనే మరీ దగ్గరగా కాకపోయినా రెండు వీధులు అవతలగా ఏపీ సీఎం చంద్రబాబు ఇల్లు వుంది. బాలయ్య ఇల్లు రెండు వీధలకు కలిపి వుంది. ఒక వీధిలో బాలయ్య ఇంటి లైన్లో అన్నీ కమర్షియల్సే. రెండో లైన్లో మాత్రం రెసిడెన్స్ లు, కమర్షియల్స్ అన్నీకలిపి వున్నాయి.

ఈ లైన్ రోడ్లు మరీ ఎక్కువ వెడల్పు కాదు. ట్రాఫిక్ సమస్యలు కాస్త ఎక్కువే. మరి ఇలాంటి చోట మాల్ నిర్మాణం సాధ్యమవుతుందా? ఆ మధ్య ఇదే ఇంటి స్థలానికి చెందిన కొంతభాగాన్ని రోడ్డు వెడల్పు కోసం తీసుకుంటురాని వార్తలు వినవచ్చాయి. మరి అలాంటపుడు మాల్ కు అనుమతి సాధ్యమవుతుందా? అన్నదీ అనుమానం.

హీరో బాలకృష్ణకు హైదరాబాద్ ట్విన్ సిటీలో చాలా ఆస్తులు వున్నాయి. అందువల్ల వేరే ప్రాపర్టీలో ఏదన్నా దాంట్లో మాల్ నిర్మాణం చేయడానికి సన్నాహాలు చేస్తుంటే, ఈ ఇల్లు అనుకుని గాసిప్ పుట్టిందేమో అన్న అనుమానం కూడా వుంది.