బాలీవుడ్లో ‘బూతు’ని నమ్ముకుని చాలా సినిమాలే వస్తున్నాయి. ఒకప్పుడు బిపాసా బసు లాంటోళ్ళు బాలీవుడ్లో హాట్ హీరోయిన్స్. కానీ, ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. పోర్న్స్టార్స్ని కూడా లాక్కొచ్చేస్తున్నారు బాలీవుడ్‌లోకి. అలా బాలీవుడ్‌లోకి వచ్చిన పోర్న్‌స్టార్ సన్నీలియోన్, తన స్థాయికి తగ్గట్టుగానే సినిమాల్లో బూతుని పండిరచేస్తోంది.
తాజాగా సన్నీలియోన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న ‘రాగిణి ఎంఎంఎస్-2’ సినిమా బాలీవుడ్లో సంచనాలకీ, వివాదాలకీ కారణమవుతోంది. ఇంకా సినిమా విడుదల కాలేదుగానీ, ఈ సినిమా కొత్త ట్రెయిలర్ సెన్సేషన్ సృష్టిస్తోంది. ఇంత పచ్చిగానా.? అని బాలీవుడ్ సినీ జనం ముక్కున వేలేసుకుంటున్నారు.
విచిత్రమేంటంటే ఈ సినిమాకి ఏక్తాకపూర్ నిర్మాత కావడం. గతంలో వచ్చిన ‘రాగిణి ఎంఎంఎస్’ సినిమానే చాలా వివాదాల్ని సృష్టిస్తే, సన్నీలియోన్ ‘రాగిణి ఎంఎంఎస్`2’ ఇంకా చాలా వివాదాలు సృష్టించే అవకాశాలున్నాయని ట్రెయిలర్‌ని బట్టి అర్థమవుతోంది. ఇండియన్ సినిమా ఎదిగిపోతోంది.. ఇలాంటి సినిమాలతో పోర్న్ సినిమాలకు దగ్గరవుతోంది.. అని అనకుండా వుండలేం.