పవన్‌కళ్యాణ్, సంపత్‌నంది కాంబినేషన్‌లో గబ్బర్‌సింగ్ సీక్వెల్ ఉంటుందని, ఈ ప్రాజెక్ట్ కాన్సిల్ అయిందనే న్యూస్ నిజం కాదని ప్రెస్ నోట్ పంపించిన సంగతి తెలిసిందే. అయితే గబ్బర్‌సింగ్ సీక్వెల్ ఐడియా డ్రాప్ అయ్యారని, దాని ప్లేస్‌లో మరో సినిమా ఇదే కాంబినేషన్‌లో చేస్తున్నారని లేటెస్ట్ న్యూస్.
గబ్బర్‌సింగ్ సీక్వెల్ కోసం పవన్ ఒక ఐడియా అనుకున్నాడు. దానిని డెవలప్ చేయడానికి సంపత్ నందితో సహా కొందరు రచయితల బృందం ఏడాదికి పైగా కృషి చేసారు. అయినప్పటికీ పవన్ శాటిస్‌ఫై అయ్యేలా ఈ సబ్జెక్ట్ రెడీ కాకపోవడంతో అసలు ఈ ప్రాజెక్ట్‌నే కాన్సిల్ చేయాలని అనుకున్నారు.
అయితే సంపత్ నంది మరో కథ ఏదో పవన్‌కి చెప్పాడట. ఇది బాగానే ఉందనిపించి పవర్‌స్టార్ దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడట. ఓ మై గాడ్ రీమేక్‌లో నటించడానికి అంగీకరించిన పవన్‌కళ్యాణ్ సైమల్టేనియస్‌గా సంపత్ నంది సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని పూజ మరో రెండు రోజుల్లో జరుగుతుంది. అఫీషియల్‌గా ఇది గబ్బర్‌సింగ్ సీక్వెల్ కాదని అక్కడే అనౌన్స్ చేస్తారేమో మరి.