గబ్బర్ సింగ్ 2 రెండేళ్లకు పైగా వార్తల్లో నలుగుతున్న సినిమా. ఆఖరికి ఈ మధ్య మహారాష్ట్రలో షూటింగ్ ప్రారంభమైంది. హమ్మయ్య ఇప్పటికైనా కదిలింది రథం అనుకున్నారు అభిమానులు. కానీ ముచ్చటగా మూడు రోజులు షూటింగ్ జరపుకుని, వెనక్కు వచ్చింది యూనిట్ అని వినికిడి. అది కూడా హీరోకు సంబంధం లేని సీన్లు.
మరోపక్క హీరోయిన్ ను మారుస్తున్నారంటూ గుసగుసలు. అంటే కథ మళ్లీ మొదటికి వచ్చిందన్న మాట. మళ్లీ షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుందో, ఎవరి ఊహలకు అందడం లేదు..టాలీవుడ్ లో ఏ థ్రెడ్ కు అందండం లేదు. అది పవన్ కే తెలియాలి అన్న సమాధానాలే వినిపిస్తున్నాయి.
మరి ఇలా మూడేసి రోజుల షూటింగ్, ముఫై రోజుల గ్యాప్ అంటే గబ్బర్ సింగ్ 2 ఎప్పటికి పూర్తయ్యేను?