అనీషా అంబ్రోస్…చటుక్కున వార్తల్లోకి వచ్చిన పేరు. చిన్న సినిమాతో రంగంలోకి వచ్చి, పవన్ దృష్టిలో పడి ఏకంగా గబ్బర్ సింగ్ 2 కి హీరోయిన్ అయిపోయింది. ఆ తరువాత పవన్ ఆమెకు నట శిక్షణ కూడా ఇప్పిస్తున్నాడని, ఇంకా రకరకాల వార్తలు వినవచ్చాయి. అయితే ఇప్పుడు మళ్లీ మరో వార్త చక్కర్లు కొట్టడం ప్రారంభించింది. అనీషా అంబ్రోస్ ను పవన్ మార్చేయాలనుకుంటున్నాడన్నది ఆ వార్త.
అనీషా పెర్ ఫార్మెన్స్ పవన్ కు నచ్చలేదని, మార్చే ఉద్దేశంలో వున్నారని వదంతి వినిపిస్తోంది. అయితే ఇది అంత నమ్మదగ్గదిగా అయితే లేదు. ఎందుకంటే సినిమా ఇంకా అంత వరకు రాలేదు. విలన్ పై కాస్త షూటింగ్ జరిపారని వినికిడి.
ఓ నటి పె ఓ అంచనాకు రావాలంటే కనీసం కొంత సినిమా షూటింగ్ జరగాలి కదా..మరి ఈ లోగానే ఈ వార్త షికారు చేయడం అంటే ఏమనుకోవాలి? నిజానికి అనీషా ను ఎంపిక చేసినపుడే పవన్ అభిమానులు కాస్త కలవరపడ్డ మాట వాస్తవం.
సరైన నోన్ ఫేస్ ను తీసుకోకుండా ఈ కొత్త ప్రయోగం ఏమిటి? అని. ఇప్పుడు మరి ఆ కలవరపాటులో పుట్టిందో, నిజమో తెలియాలంటే కొంత కాలం ఆగాలి మరి.