గజనీ కాన్సెప్టేనా నానీ?

భలే భలే మగాడివోయ్..నాని-లావణ్య త్రిపాఠీ జంటగా దర్శకుడు మారుతి రూపొందిస్తున్న చిత్రం. గీతా ఆర్ట్స్ కొత్త బ్యానర్ బి, యువి క్రియేషన్స్ కలిపి నిర్మిస్తున్న సినిమా ఈ రోజు షూటింగ్ పూర్తి చేసుకుంది. సారథి…

భలే భలే మగాడివోయ్..నాని-లావణ్య త్రిపాఠీ జంటగా దర్శకుడు మారుతి రూపొందిస్తున్న చిత్రం. గీతా ఆర్ట్స్ కొత్త బ్యానర్ బి, యువి క్రియేషన్స్ కలిపి నిర్మిస్తున్న సినిమా ఈ రోజు షూటింగ్ పూర్తి చేసుకుంది. సారథి స్టూడియోలో చిత్రీకరించిన పాటతో షూటింగ్ పార్ట్ పూర్తయింది.

సినిమా కాన్సెప్ట్ బేస్డ్ గా వుంటూనే, ఫుల్ లెంగ్త్ ఎంటర్ టైనీగా వుంటుదని చెప్పాడు నాని. పిల్ల జమీందార్ తరువాత అవుట్ అవుట్ ఎంటర్ టైన్ మెంట్ సినిమా చేస్తున్నానని, పైగా కాన్సెప్ట్ కూడా మిక్స్ అయిందని, ఇలా జరగడం అరుదు అనీ చెప్పుకొచ్చాడు. ఇంతకీ ఏమిటా కాన్సెప్ట్ అంటే అడియో ఫంక్షన్ రోజు, ట్రయిలర్ చూస్తే తెలిసి పోతుందని అంటున్నాడు. మోషన్ పోస్టర్ లో మెమరీ నిల్..ఎంటర్ టైన్ మెంట్ ఫుల్ అన్నారు. దానర్థం అదేనా?

అయితే ఇది కాస్త గజనీ టైపు కాన్సెప్ట్ అని వినికిడి. మరీ గజనీ లా కాకున్నా, కాస్త మరుపు వుండే కుర్రాడు ప్రేమలో పడితే పుట్టే గజిబిజి, ఆపై వచ్చే హాస్యం ఆధారంగా ఈ భలే భలే మగాడివోయ్ తయారవుతోందని తెలుస్తోంది. ఈ ప్రాజెక్టు సునీల్ నుంచి నాగచైతన్య మీదుగా నాని దగ్గరకు వచ్చింది. మంచి కాన్సెప్ట్ కావడంతో నాని వెంటనే ఒకె అనేసాడు