గరుడవేగ ఎవరికి లాభం?

ఇటీవలి కాలంలో కాస్త వేగంగా మౌత్ టాక్ స్ప్రెడ్ అయిన సినిమాగా గరుడవేగను చెప్పుకోవచ్చు. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమాకు కాస్త చెప్పుకోదగ్గ టాక్ నే వచ్చింది. సమీక్షలు వచ్చాయి. అయితే…

ఇటీవలి కాలంలో కాస్త వేగంగా మౌత్ టాక్ స్ప్రెడ్ అయిన సినిమాగా గరుడవేగను చెప్పుకోవచ్చు. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమాకు కాస్త చెప్పుకోదగ్గ టాక్ నే వచ్చింది. సమీక్షలు వచ్చాయి. అయితే అంచనాలు లేకపోవడం వల్ల తొలి రోజు పెద్దగా షేర్ రాలేదు. తొలి రోజు, మలి రోజు కలిపి వచ్చిన షేర్ దాదాపు కోటిన్నర మాత్రమే. 

ప్రవీణ్ సత్తారు ఫై భారీ అంచనాలు లేకపోవడం, రాజశేఖర్ హీరో కావడంతో సినిమాను అమ్ముకోలేకపోయారు. రాజశేఖర్ భార్య దగ్గర దగ్గర 8కోట్లు సినిమా కోసం పెట్టుబడి పెట్టినట్లు తెలుస్తోంది. మరి సినిమా హిట్ అయింది కాబట్టి అది రికవరీ అవుతుందా? అన్నది ప్రశ్న. దాదాపు ఆంధ్ర, సీడెడ్, నైజాంల్లో స్వంత విడుదలే. కానీ పటిష్టంగా డబ్బులు రాబట్టుకోగల సత్తా జీవితకు వుందా అన్నది అనుమానం.

సీడెడ్ లో స్వంతగా ఫోన్ లు చేసి, ఏర్పాట్లు చేసుకుని సాయి కొర్రపాటి అందించిన సహకారంతో సినిమా విడుదల చేసారు. మరి ఎగ్జిబిటర్లు, లెదా మధ్యలో వున్న డిస్ట్రిబ్యూటర్లు ఏ మాత్రం వెనక్కు పంపిస్తారన్నది ఫ్రశ్న. నైజాంలో మల్కాపురం శివకుమార్ కొటి రూపాయల అడ్వాన్స్ పై ఆడిస్తున్నారని టాక్.

కానీ ఆయనకు పాత సినిమాల సమస్యలు వున్నాయని వినికిడి. అందువల్ల ఎగ్జిబిటర్ల దగ్గర నుంచి ఆయనకు రావడం అంత సులువు కాకపోవచ్చు. ఇక ఆంధ్ర సురేష్ మూవీస్ చేతిలో వుంది. లెక్కలు తేలడానికే చాలా టైమ్ పడుతుందని వినికిడి.

మరి జీవిత రాజశేఖర్ ఇన్వెస్ట్ చేసిన సుమారు 8కోట్లు ఎప్పుడు రికవరీ అవుతాయి? శాటిలైట్ అండ్ డిజిటల్ రైట్స్, అదర్ లాంగ్వేజ్ రైట్స్ ఒక్కటే హోప్. పద్దతిగా జాగ్రత్తగా చేసుకుంటే ఇక్కడ ఓ అయిదు ఆరుకోట్లు లాగవచ్చు. ఇవి వస్తే కానీ జీవిత రాజశేఖర్ ఫైనాన్స్ సమస్యలు గట్టెక్కవు. మూడు కోట్ల ఫైనాన్స్ వుండనే వుంది. మళ్లీ విడుదలయిన మర్నాడు కోటి రూపాయిలు ఫైనాన్స్ తెచ్చారని వినికిడి. అంటే టోటల్ గా నాలుగు కోట్లు తీర్చాల్సి వుంది.

భవిష్యత్ ఆశాజనకం

అయితే రాజశేఖర్ మళ్లీ ఫామ్ లోకి వచ్చారు కాబట్టి, జనం చూస్తారన్న నమ్మకం కుదిరింది కాబట్టి, జగపతిబాబులా మళ్లీ తండ్రి, మామగారు క్యారెక్టర్లు తెచ్చుకోగలగాలి. హీరోగానే అన్న పంతం లేకుండా కెరీర్ ప్లాన్ చేసుకుంటే, మళ్లీ జగపతిబాబు మాదిరిగానే సెటిల్ అయిపోవచ్చు అన్ని విధాలా. అంతే కానీ గరుడవేగ విజయంతో మాత్రమే అన్ని సమస్యలు అయితే తీరిపోవు.

గరుడవేగ విజయం దర్శకుడు ప్రవీణ్ సత్తారుకు కాస్త పనికి వస్తుంది. ఈ సర్టిఫికెట్ చూసి, యంగ్ హీరోలు ఎవరైనా చాన్స్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా వున్నాయి. అయితే ఇమ్మీడియట్ గా ఎవరూ రెడీగా లేరు. పైగా ప్రవీణ్ సత్తారు పుల్లెల గోపీచంద్ బయోపిక్ చేసే అయిడియాలో వున్నారు. దాని కన్నా ముందుగా ఓ సినిమా దొరికితేనే ఫలితం వుంటుంది.