కీర్తి సురేష్-జగపతి బాబు ల కాంబినేషన్ లో డైరక్టర్ నగేష్ కుకునూర్ తయారు చేసిన సినిమా గుడ్ లక్ సఖి. ఈ సినిమా ప్రాజెక్టు కాస్త ఆలస్యంగా నిర్మాత దిల్ రాజు దగ్గరకు చేరింది. ఆ తరువాత చకచకా పూర్తి చేసుకుంది. లాక్ డౌన్ ముందే దాదాపు పూర్తయింది. అయితే కరోనా మాత్రమే ఈ సినిమాకు బ్రేక్ వేయలేదు. నిర్మాత కమ్ డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు కూడా కాస్త గట్టి బ్రేక్ వేసినట్లు తెలుస్తోంది.
విషయం ఏమిటంటే, సినిమా దాదాపు రెడీ అయిన తరువాత దిల్ రాజు ప్రత్యేకంగా చూసారట. ఇది ఇప్పటి మాట కాదు, చూసి చాలా రోజులే అయిపోయింది. కానీ చూడగానే దీన్ని ఇలా వుంచండి…చాలా కరెక్షన్స్ చేయాలి అని దిల్ రాజు చెప్పినట్లు ఇండస్ట్రీ వర్గాల బోగట్టా. దాంతో ఆ సినిమాను అలా వుంచేసారని తెలుస్తోంది.
కరోనా వ్యవహారం ముగిసిపోయి, మళ్లీ షూట్ లు ప్రారంభమైతే, అప్పుడు దిల్ రాజు అనుభవం, అభీష్టం మేరకు కరెక్షన్లు చేయించాల్సి వుంటుంది. అప్పుడు గుడ్ లక్ సఖి తెరపైకి వస్తుంది.