మొత్తానికి డైరక్టర్ సంపత్ నంది తరువాతి సినిమా ఫిక్సయిపోయినట్లే. హీరో గోపీచంద్ తో సినిమా చేసేందుకు డిసైడ్ అయ్యారు సంపత్ నంది. బెంగాల్ టైగర్ సినిమా హిట్ అయిన తరువాత హీరో రామ్ చరణ్ కు ఓ పాయింట్ చెప్పారు..అదే చోటా మేస్త్రీ..చరణ్ కు బాగా నచ్చింది.
కానీ చరణ్ ఇప్పట్లో ఖాళీ లేరు. ధృవ చేస్తున్నారు, సుకుమార్ సినిమా చేయాల్సి వుంది, యువి వాళ్లకి మారుతితో కానీ మరొకరితో అయినా ఓ సినిమా చేయాల్సి వుంది. అందువల్ల సంపత్ నంది సినిమా పట్టాలు ఎక్కడానికి బాగా టైమ్ పట్టేలా వుంది. అందుకే ఈ లోగా ఓ సినిమా ఇంకో హీరో చేయాలని సంపత్ నంది అనుకున్నారు. స్క్రిప్ట్ రెడీ చేసుకున్నారు.
అయితే చరణ్ కు ఓ మాట చెప్పాలని ఆగారు. కాశ్మీర్ నుంచి రాగానే చరణ్ కు చెప్పినట్లు తెలుస్తోంది. ఆయన కూడా ఓకె చెప్పారని వినికిడి. ఈ మేరకు గోపీచంద్ హీరోగా ఓ సీనియర్ , భారీ చిత్రాల నిర్మాతతో ప్రాజెక్టు ఫైనల్ అయింది. ఒకటి రెండు రోజుల్లో ప్రకటన వస్తుంది. అవును..ఇంతకీ ఈసారైనా పెద్ద మ్యూజిక్ డైరక్టర్ తో ముందుకు వెళ్తారా? లేక…? మళ్లీ భీమ్స్ యేనా?