గోపీచంద్-తేజ..పీపుల్స్ మీడియా

వరుస ఫ్లాపులతో కిందా మీదా అవుతున్నాడు హీరో గోపీచంద్. మిగిలిన ఆశ ప్రస్తుతం చేస్తున్న సీటీమార్. అయితే చేతిలో సినిమాలకు లోటు లేదు. Advertisement ఎందుకంటే కరోనా తరువాత ప్రతి చిన్న హీరో, ప్రతి…

వరుస ఫ్లాపులతో కిందా మీదా అవుతున్నాడు హీరో గోపీచంద్. మిగిలిన ఆశ ప్రస్తుతం చేస్తున్న సీటీమార్. అయితే చేతిలో సినిమాలకు లోటు లేదు.

ఎందుకంటే కరోనా తరువాత ప్రతి చిన్న హీరో, ప్రతి ఫ్లాప్ డైరక్టర్ కు కూడా సినిమాలే సినిమాలు. ఓటిటి మహత్యం అలాంటిది. అందుకే చాలా మంది గోపీచంద్ వైపు చూస్తున్నారు.

ఇలాంటి నేపథ్యంలో పీపుల్స్ మీడియా ఓ సినిమాను గోపీచంద్ తో ప్లాన్ చేస్తోంది. సీత సినిమాతో హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కు దారుణమైన డిజాస్టర్ ను బహుమతిగా ఇచ్చిన తేజ దర్శకుడు.

గతంలో పీపుల్స్ మీడియా భాగస్వాములకు హోరా హోరీ అనే ఫ్లాపును కూడా గిఫ్ట్ గా ఇచ్చి వున్నాడు.మొత్తానికి వేరే వాళ్ల కథ ఒకటి తీసుకుని, తేజ డైరక్షన్ లో గోపీచంద్ తో పీపుల్స్ మీడియా సినిమా చేస్తుందట. అదీ విషయం.

గ్రేటర్ గెలుపు ఎవరిది