నిన్న మొన్నటి వరకు గుణశేఖర్ కు ఒకటే టెన్షన్. సినిమా ప్రారంభించడం, పూర్తిచేయడానికి ఆయన చాలా వ్యయ ప్రయాసలకు లోనయ్యారు. అయినా తట్టుకుని పూర్తి చేసారు. కానీ మార్కెటింగ్ ఎలా? చాలా ఎక్కువ ఖర్చు చేసారు.
Advertisement
అయితే అయింది..తన ప్రొడక్ట్ ఎలా వుందన్నది తెలియచెప్పడానికి , ఐమాక్స్ లో వేసిన ట్రయిలర్ ప్రివ్వూ భలేగా పనికి వచ్చింది. ఇప్పుడు మాంచి ఆఫర్లు వస్తున్నాయని వినికిడి. మరోపక్క తమిళ హక్కులు మాంచి రేట్ కు అమ్ముడుపోయాయట. అనుష్క వుండడం, రానా, నిత్యామీనన్ లకు తమిళనాట పరిచయం వుండడం, పైగా ఇళయరాజా సంగీతం వల్ల మాంచి రేటు వచ్చిందట. పది కోట్ల మేరకు రేటు పలికిందని వినికిడి.