జనవరిలో వస్తాడనుకున్న వెంకటేష్ గురుకు ఇప్పటికి టైమ్ వచ్చింది. సెన్సార్ కంప్లీట్ చేసుకుంది. క్లీన్ యు సర్టిఫికెట్ వచ్చింది. ట్రయిలర్ కు బజ్ కూడా బాగానే వచ్చింది. ప్రమోషన్ ఏక్టివిటీ కూడా బాగానే వుంది. అయితే విడుదల నెలాఖరులోనా, ఫస్ట్ వీక్ లోనా అన్నది క్లియర్ గా ప్రకటించడం లేదు. నెలాఖరులో విడుదల చేయాలనే హీరో వెంకటేష్, ఆయన సోదరుడు సురేష్ బాబు పట్టుదలగా వున్నారు.
అయితే నైజాం ఏరియాలో సురేష్ కు అన్ని విధాలా సన్నిహితుడైన ఏసియన్ సునీల్ కాటమరాయుడు సినిమా కొన్నారు. సుమారు 18 కోట్లకు పైగా స్టేక్ అది. అందువల్ల ఆ అమౌంట్ రికవరీకి ఏ మాత్రం అడ్డం పడవద్దని ఆయన సురేష్ బాబును కోరుతున్నట్లు తెలుస్తోంది. అయితే గురు సినిమా విడుదల చేయకపోయినా, నెలాఖరులో పూరి జగన్నాధ్ రోగ్, నయనతార డోర సినిమాలు షెడ్యూలు అయి వున్నాయి.
పైగా ఉగాది, సమ్మర్ హాలీడేస్ ప్రారంభంలాంటి ఈ గోల్డెన్ టైమ్ ను వదులుకోవడం అంత మంచిది కాదని సురేష్ బాబు అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది. పోనీ వన్ వీక్ వెనక్కు వెళ్దామా అనుకున్నా, మణిరత్నం చెలియా, ఇంకా చిన్న సినిమాలు వున్నాయి. ఆ తరువాత వరుణ్ తేజ మిస్టర్, లారెన్స్ హర్రర్ సినిమా వున్నాయి. అందువల్ల గురును నెలాఖరులో తేవడమే సేఫ్ అని నిర్మాతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.