హారిక-త్రివిక్రమ్-మైత్రీ-సుకుమార్

ఇప్పుడు టాలీవుడ్ లో కొత్త ట్రెండ్ నడుస్తోంది. ఏ నిర్మాత దగ్గర డైరక్టర్ వుంటే, వాళ్లకే హీరోల డేట్ లు. అందుకే తెలివిగా, డైరక్టర్ లపై రుమాళ్లు వేసేస్తున్నారు. ఈ విషయంలో హారిక హాసిని…

ఇప్పుడు టాలీవుడ్ లో కొత్త ట్రెండ్ నడుస్తోంది. ఏ నిర్మాత దగ్గర డైరక్టర్ వుంటే, వాళ్లకే హీరోల డేట్ లు. అందుకే తెలివిగా, డైరక్టర్ లపై రుమాళ్లు వేసేస్తున్నారు. ఈ విషయంలో హారిక హాసిని సంస్థ, మైత్రీమూవీస్ ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నాయి. హారిక హాసిని బ్యానర్ నే డైరక్టర్ త్రివిక్రమ్ కోసం కేటాయించేసారు. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పెట్టి, చాలామంది డైరక్టర్లను లాగేసారు.

మైత్రీ మూవీస్ కూడా ఇప్పుడు ఇదే దారిలో వుంది. రంగస్థలంతో తమకు మరపురాని హిట్ ఇచ్చిన సుకుమార్ ను మరో రెండు సినిమాలకు లాక్ చేసేసారు. అంతే కాదు. రంగస్థలం సినిమా మాంచి లాభాలు ఆర్జించినందుకు గాను, రాయల్టీ అనో, అదనపు రెమ్యూనిరేషన్ అనో, ఏదో పేరు చెప్పి, సుకుమార్ కు ఏడుకోట్లు ప్రత్యేకంగా అందించారు. 

సుకుమార్ వుండడంతో మహేష్ బాబు తన తరువాత సినిమా డేట్ లు ఇచ్చేసారు. అలాగే చందు మొండేటితో ఒక సినిమా చేస్తూనే మరో సినిమాకు లాక్ చేసారు. ఇంకా పలువురు యంగ్ డైరక్టర్ల కు అడ్వాన్స్ లు ఇస్తున్నారు. ఆరంభంలో హీరోలను లాక్ చేసిన, మైత్రీ మూవీస్ ఇప్పుడు స్ట్రాటజీ మార్చినట్లు డైరక్టన్లు లాక్ చేయడం స్టార్ట్ చేసినట్లు కనిపిస్తోంది.