హరీష్-పుప్పాల ఇంకా రగులుతోంది

తనకు ఓ సినిమా చేస్తానని అగ్రిమెంట్ చేసారని, అందువల్ల ఎలాగైనా సరే, దర్శకుడు హరీష్ శంకర్ ఇప్పుడు తనకే సినిమా చేయాలని నిర్మాత రమేష్ పుప్పాల వాదిస్తున్న సంగతి తెలిసిందే. తను అయిదు లక్షలు…

తనకు ఓ సినిమా చేస్తానని అగ్రిమెంట్ చేసారని, అందువల్ల ఎలాగైనా సరే, దర్శకుడు హరీష్ శంకర్ ఇప్పుడు తనకే సినిమా చేయాలని నిర్మాత రమేష్ పుప్పాల వాదిస్తున్న సంగతి తెలిసిందే. తను అయిదు లక్షలు అడ్వాన్స్ ఇచ్చానని, పక్కగా అగ్రిమెంట్ వుందని రమేష్ పుప్పాల తెలిపారు. ఈ విషయమై రెండు సార్లు హరీష్ శంకర్ కు నోటీసులు ఇచ్చానని, అయినా సమాధానం లేదని ఆయన వివరించారు. కనీసం ఇది కాకుంటే, సమాంతరంగా ఓ సినిమా చేస్తాననో, మరోటనో చెబితే తానేం కాదంటానా? అని ఆయన అంటున్నారు. అందుకే ఈ విషయమై చాంబర్ మెట్లు ఎక్కడం మినహా గత్యంతరం లేదని రమేష్ పుప్పాల అంటున్నారు. 

అయితే దర్శకుడు హరీష్ శంకర్ వెర్షన్ వేరుగా వుంది. తను రమేష్ పుప్పాలను కలిసానని, తరువాత సినిమా చేస్తానని లేదా, మంచి కథ, స్క్రిప్ట్ రెడీగా వుందని, హీరోను తెచ్చుకుంటే అది వినిపించి, తానే ప్రాజెక్టు సెట్ చేస్తానని అంటున్నారు. ఈ మేరకు మరో దర్శకుడు వీరశంకర్ మధ్యవర్తిత్వంలో మాటలు కూడా జరిగాయని అన్నారు. 

ఇదిలా వుంటే సర్వీస్ కు సంబంధించిన అగ్రిమెంట్ల విషయంలో అనేక న్యాయపరమైన చిక్కులు వున్నాయని, అందువల్ల ఇద్దరు కూర్చుని, ఎమికబుల్ గా సెటిల్ చేసుకుంటే బెటర్ అని చాంబర్ వర్గాలు అంటున్నాయి. మొత్తానికి ఈ సమస్య కాస్త బిగుసుకునేలాగే వుంది.