దక్షిణాది కథలు, కథానాయకులు, నాయికలు… బాలీవుడ్‌కి ఎగుమతి అయిపోతున్నారు. ఇప్పుడు దర్శకుల వంతు వచ్చింది. మొన్నామధ్య పూరికి పిలుపొచ్చింది. బుడ్డా తీసి వచ్చాడు. ఇప్పుడు క్రిష్ అక్కడికి వెళ్తున్నాడు. ఈలోగా హరీష్ శంకర్‌కి ఆఫర్ వచ్చింది.
నువ్వు మా బాలీవుడ్లో ఓ సినిమా చేయాల్సిందే.. అని అక్కడి నిర్మాతలు హరీష్‌ని తెగ బతిమాలేస్తున్నారట. పైగా దక్షిణాది కథల్ని రీమేక్ చేసేయ్.. అని ఓపెన్ ఆఫర్ ఇస్తున్నారట. దాంతో హరీష్ కూడా బాలీవుడ్ వెళ్లిపోవడానికి సన్నాహాలు చేసుకొంటున్నాడు.
ఇక్కడి కమిట్ మెంట్స్ అయిపోగానే హిందీలో ఓ సినిమా చేస్తాడట. ఎన్టీఆర్ సినిమా రామయ్యా వస్తావయ్యా సినిమాకి కొన్ని మార్పులు చేసి బాలీవుడ్లో వదులుతాడట. మరి ఆ సినిమాలో హీరోగా ఎన్టీఆర్‌నే తీసుకొంటాడా?? లేదంటే బాలీవుడ్ హీరో కావాలంటాడా?? చూడాలి మరి.