హెలికాప్టర్ లో బాలయ్య

బాలయ్య 101వ సినిమా విడుదల దగ్గరకు వస్తోంది. సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను ఖమ్మంలో ప్లాన్ చేసారు. ఈ నెల 17న పైసా వసూల్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఖమ్మంలో జరుగుతుంది. ఈ…

బాలయ్య 101వ సినిమా విడుదల దగ్గరకు వస్తోంది. సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను ఖమ్మంలో ప్లాన్ చేసారు. ఈ నెల 17న పైసా వసూల్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఖమ్మంలో జరుగుతుంది. ఈ ఫంక్షన్ కు ప్రత్యేకంగా రాజకీయ అతిధులు హాజరవుతున్నారు.

తెలంగాణ మంత్రి, తెరాసకు చెందిన తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ, తెలుగుదేశం పార్టీకి చెందిన నామా నాగేశ్వర రావు ఈ ఫంక్షన్ కు ముఖ్య అతిధులుగా హాజరవుతారు. ఇండస్ట్రీ నుంచి డైరక్టర్ క్రిష్, కెఎస్ రవికుమార్ తదితరులు హాజరవుతారు.

ఇదిలా వుంటే హైదరాబాద్ నుంచి హీరో, హీరోయిన్లు, డైరక్టర్ ఖమ్మం చేరేందుకు హెలికాప్టర్ అరేంజ్ చేస్తున్నారు. రోడ్డు దారిన వెళ్తే చాలా టైమ్ పడుతుంది. అందుకే సుమారు పది లక్షల ఖర్చుతో ప్రయివేటు హెలికాప్టర్ ను ఏరేంజ్ చేస్తున్నారు.

ఖమ్మంలో తొలిసారి బాలయ్య లాంటి పెద్ద హీరో ఈవెంట్ జరుగుతున్నందున, పైగా ఖమ్మంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు బలంగానే వున్నందున, టోటల్ గా వేలాది మంది ఈ ఓపెన్ ఫంక్షన్ కు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. అందుకు తగినట్లు ఏర్పాట్లుచేస్తున్నారు.