హలో ఓవర్ సీన్ @ 5.5 కోట్లు

జై లవకుశ, స్పైడర్, పైసా వసూల్, మహానుభావుడు ఇలా విడుదలవుతున్న సినిమాలన్నీ ఓవర్ సీస్ లో కిందా మీదా అవుతున్నాయి. జై లవకుశ, మహానుభావుడు మెల్లగా బ్రేక్ ఈవెన్ దిశగా వచ్చాయి. మిగిలిన వాటి…

జై లవకుశ, స్పైడర్, పైసా వసూల్, మహానుభావుడు ఇలా విడుదలవుతున్న సినిమాలన్నీ ఓవర్ సీస్ లో కిందా మీదా అవుతున్నాయి. జై లవకుశ, మహానుభావుడు మెల్లగా బ్రేక్ ఈవెన్ దిశగా వచ్చాయి. మిగిలిన వాటి సంగతి తెలిసిందే. ఈ ఎఫెక్ట్ రాబోయే సినిమాల బేరాల మీద పడుతోంది. 

విక్రమ్ కుమార్-అఖిల్ కాంబినేషన్ సినిమా హలో ఓవర్ సీస్ రైట్స్ బేరం జస్ట్ యాభై లక్షల దగ్గర ఊగిసలాడుతోంది అంటే పరిస్థితి అర్థం అవుతుంది. ఈ సినిమా ఓవర్ సీస్ రైట్స్ ను యూనిట్ అయిదున్నర కోట్ల దగ్గర కోట్ చేస్తోంది. కానీ కొనాలనుకుంటున్న యుఎస్ తెలుగు మూవీస్ నాలుగున్నర నుంచి అయిదు కోట్లను దాటడం లేదు. 

దీనికి కారణం మరేమీ లేదు. ప్రస్తుతం ఓవర్ సీస్ రిటైల్డ్ బయ్యర్ల దగ్గర పైసలు లేవు. ఈ మధ్య విడుదలయిన భారీ సినిమాల పుణ్యమా అని పరిస్థితి అలా వుంది. మళ్లీ ఒకటి రెండు హిట్ లు పడితే, జనాల దగ్గర కాస్త డబ్బులు చేరతాయి.

కొనేవాళ్లు మాగ్జిమమ్ అయిదు కోట్లు అంటున్నారట. హలో నిర్మాతలు మాత్రం అయిదున్నర దగ్గరే వుండిపోయారు. మరెవరైనా తెగించి యాభై కలిపితే వాళ్లకే హక్కులు ఇచ్చేస్తారేమో?