సాయిధరమ్ తేజ్.. ఇదీ కొణిదెల వారి మేనల్లుడి పేరు. కానీ ఇటీవల వరుసగా ఆరుఫ్లాపులు వచ్చాయి. అసలు కెరీర్ నే డవుట్ లో పడింది. ఇలాంటి టైమ్ లో మరి న్యూమరాలజీ మీద నమ్మకం పెరగిందో? లేక ఎవరైనా సలహా ఇచ్చారో కానీ, పేరు మార్చేసుకున్నాడు. సాయితేజ్ అన్నది కొత్త స్క్రీన్ పేరు.
రాబోయే చిత్రలహరి టైటిల్స్ లో ఈ విధంగానే వుండబోతోంది. ఇప్పటికే ఈరోజు విడుదల చేసిన పరుగు పరుగు పాట వీడియోలో టైటిల్స్ లో సాయితేజ్ అనే ప్రకటించారు. అంటే ఇక్కడ నుంచి ఇక అదే పేరు కనిపిస్తుందన్నమాట.
సాయిధరమ్ తేజ్ అన్నపేరు వున్నా, నిజానికి సన్నిహితులు అంతా తేజు అని పిలుస్తారు. ఆ పేరు, పిలుపు మారదు. స్క్రీన్ పేరు మాత్రం మారింది. ధరమ్ అన్నది కాస్తా ఎగిరిపోయింది. తరువాత సినిమాను డైరక్టర్ మారుతితో చేయబొతున్నారు తేజు.
మారుతికి ఈ జాతకాలు, న్యూమరాలజీ వంటి వ్యవహారాలు చాలా ఎక్కువ వున్నాయి. గతంలో మారుతి తన పేరు మీద కూడా కొన్ని ప్రయోగాలు చేసారు. మరి ఆయనే ఈ పేరు మార్పు సూచించారేమో అన్నది అనుమానం. పేరు మారాక హిట్ కొడితే సాయితేజ్ అన్నది ఫిక్స్ అయిపోతుంది.