బాలయ్య లేటెస్ట్ సినిమా రూలర్ పూర్తయిపోయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు చకచకా జరిగిపోతున్నాయి. మరో నెల దాటితే జనం ముందుకు వచ్చేస్తుంది. అందుకే బాలయ్య అప్పుడే తన తరువాత సినిమా మీద దృష్టి పెట్టేసారు. దర్శకుడు బోయపాటి ఎలాగూ ప్రీ ప్రొడక్షన్ పనులు చూసుకుంటారు. అయితే హీరోయిన్లు ఎవరు అన్నదే అసలు పాయింట్.
బోయపాటి – బాలయ్య సినిమాలో ఇద్దరు హీరోయిన్లు వుంటారని తెలుస్తోంది. హీరోయిన్లుగా ఎవరు వుండాలి? ఎవరైతే బాగుంటారు? అన్న దాంట్లో బాలయ్యకు స్పెసిఫిక్ ఐడియా వున్నట్లు బోగట్టా. ఈ మేరకు బాలయ్య దర్శకుడు బోయపాటికి కొన్ని సూచనలు చేసినట్లు తెలుస్తోంది.
అంతే కాదు, తన మేనజర్ల ద్వారా ఫస్ట్ చాయిస్, సెకెండ్ చాయిస్ అనే మాదిరిగా ఓ హీరోయిన్ల జాబితాను కూడా పంపించినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.
అయితే ఈ జాబితాలో బాలయ్య ప్రిఫర్ చేస్తున్న హీరోయిన్ పేర్లు ఏమిటో అన్నది మాత్రం ఇంకా తెలియలేదు. ప్రస్తుతం చేస్తున్న రూలర్ సినిమాలో హీరోయిన్ సోనాలి చౌహాన్ పేరును కూడా బాలయ్యే సజెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.