తెలుగులో చాన్నాళ్లుగా కొనసాగుతున్న హీరోయిన్ ఆమె. ఆశించిన బ్రేక్ అయితే రాలేదు కానీ కూసింత క్రేజ్ మాత్రం ఉంది. మేకప్ వేస్తే అప్సరసలా ఉంటుంది. (మేకప్ లేకుండా చూడలేం, అది వేరే విషయం). ఆ ముద్దుగుమ్మ నిజంగానే ప్రేమలో పడింది. పడడం ఏంటి.. ఏకంగా తన మనసులో మాట కూడా చెప్పేసింది.
అవును.. టాలీవుడ్ లో ఇప్పుడిది హాట్ టాపిక్. గతంలో ఆ బొద్దు హీరో, ఈ హీరోయిన్ కలిసి సినిమా చేశారు. తాజాగా మరో సినిమా కూడా రెడీ చేశారు. ఈ మూవీ టైమ్ లోనే ఆ హీరోకు బాగా ఎట్రాక్ట్ అయిందీమె. షూటింగ్ సందర్భంగా విదేశాలకు వెళ్లినప్పుడు “ఐ లవ్ యు” అంటూ తన మనసులో మాట చెప్పేసిందట.
ప్రస్తుతం చర్చ ఇంతవరకు మాత్రమే నడుస్తోంది. ఆ హీరోయిన్ ప్రపోజల్ కు సదరు హీరో ఓకే చెప్పాడా లేదా అనేది మాత్రం సస్పెన్స్. ఈమె మాత్రం రోజూ ఆ హీరో గారికి మెసేజీలు, ఎమోజీలు పంపిస్తూనే ఉందట.
మరోవైపు ఎప్పుడో 30దాటిన ఆ హీరోకి ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ కూడా ఉండడంతో కొంతమంది రాజకీయ నేతలు ఆ హీరోను తమ అల్లుడిగా చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి టైమ్ లో ఆ హీరోయిన్ ప్రేమను హీరో ఒప్పుకుంటాడా? ప్రస్తుతం ఇండస్ట్రీలో ఈ మేటర్ పైనే గుసగుసలు వినిపిస్తున్నాయి.