హీరోయిన్ తో డైరక్టర్ చెట్టపట్టాలు?

టావీవుడ్ లో అంతే..నిప్పు లేకుండానే పొగ వచ్చేస్తుంది. అలాంటిది నిప్పు వుంటే ఇక చెప్పనక్కరలేదు.  Advertisement అంతగాడో మిడ్ రేంజ్ డైరక్టర్. తొలి సినిమా హిట్ కొట్టాడు. మలి సినిమా మల్టీ స్టారర్ కాస్తా…

టావీవుడ్ లో అంతే..నిప్పు లేకుండానే పొగ వచ్చేస్తుంది. అలాంటిది నిప్పు వుంటే ఇక చెప్పనక్కరలేదు. 

అంతగాడో మిడ్ రేంజ్ డైరక్టర్. తొలి సినిమా హిట్ కొట్టాడు. మలి సినిమా మల్టీ స్టారర్ కాస్తా పల్టీ కొట్టింది. మళ్లీ సినిమా చేతిలోకి రావడానికి టైమ్ పట్టింది. అయినా ఆ బుల్లి సినిమా కూడా బుస్ మనలేక తుస్ మంది. ఆ తరువాత ఎలాగో అలా ఓ రీమేక్ చేసి, ఓకె అనిపించుకున్నాడు. అయినా సినిమా చేతిలోకి రాలేదు.

మొత్తం మీద ఓ చిన్న సినిమా దొరకబుచ్చుకున్నాడు. అంత వరకు బాగానే వుంది. సినిమా కెరీర్ అలా అలా ముందు వెనుక నడుస్తున్నా, ఓ హీరోయిన్ తో ప్రేమాయణం మాత్రం బాగానే నడుస్తోందని అప్పుడే గ్యాసిప్ లు ప్రారంభం అయిపోయాయి. మాంచి ఒడ్డు పొడవు, అదిరిపోయే ఫిజిక్ వున్న ఆ అమ్మాయి ఇతగాడిని ఎలా లైక్ చేస్తోందన్న క్వశ్చన్లు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. 

ఎందుకంటే సదరు దర్శకుడు అందగాడు..కనీసం హుషారైన వాడు కాదు. అలాంటి ఆ మాంచి అమ్మాయి దోస్తానా ఎలా దోచుకున్నాడా? అన్నది సినిమా రంగంలో యంగ్ డైరక్టర్లు, ప్రొడ్యూసర్లు గుసగుస లాడుకుంటున్నారు.

పడుతుంది అనుకుంటే మనమే ట్రయ్ చేసేవాళ్లమే అనే ఆలోచనేమో? మొత్తం మీద సినిమాల్లో సక్సెస్ అంతగా రాకపోయినా, మాంచి అందమైన అమ్మాయి దోస్తానా మాత్రం బాగానే దొరికింది మనవాడికి.