ఓటీటీల్లో ప్రసారం అయ్యే వెబ్ సీరిస్ లకు సంతకం చేశారంటే.. ఎంత మడిగట్టుకు కనిపించిన హీరోయిన్లు అయినా, వారెంత స్టార్లు అయినా హాట్ హాట్ గా రెచ్చిపోవాల్సిందేనేమో! తెలుగుకు సంబంధించి స్టార్లుగా, కొంత పరిమితులను ఏర్పరుచుకున్న హీరోయిన్లే వెబ్ సీరిస్ లలో భిన్నంగా కనిపించడంతో ఇలా అనుకోవాల్సి వస్తోంది.
ఒక వెబ్ సీరిస్ లో తమన్నా హాట్ నెస్ చర్చలో నిలుస్తున్న నేపథ్యంలో.. గతంలో నిత్యామేనన్, సమంతలు కూడా వెబ్ సీరిస్ లతోనే ఇలాంటి చర్చలో నిలిచిన విషయాన్ని ప్రస్తావించుకోవచ్చు. సినిమా తెరపై చాలా పరిమితులతో కనిపిస్తుంది నిత్యామేనన్. తన అందంతో కన్నా అభినయంతోనే ఆమె మంచి గుర్తింపును సొంతం చేసుకుంది.
గ్లామర్ షో,ఎక్స్ పోజింగ్ వంటి వాటికి దూరం అనిపించుకుంది. బాలనటిగా తెరపైకి వచ్చిన నిత్య 2010 సమయంలో హీరోయిన్ గా మారి దాదాపు దశాబ్దం పాటు సినిమాలతో బిజీగానే గడిపింది. ప్రత్యేకంగా నిలిచింది. అలాంటి నిత్యా మేనన్ ను ఒక లిప్ లాక్ సీన్ లో ఊహించుకోవడం పెద్ద తెరపై చాలా కష్టమయ్యేది.
కానీ ఆ మధ్య ఒక వెబ్ సీరిస్ లో నిత్య లెస్బియన్ శృంగార సన్నివేశాల్లో నటించి ఆశ్చర్యపరిచింది. అప్పటికే ఏదో సినిమాలో ఆమె లెస్బియన్ తరహా రోల్ చేసినా, అందులో అలాంటి సీన్లేమీ ఉండవు. పెద్ద తెరపై ఏ హీరోతోనూ ముద్దుముచ్చటలు చేయని నిత్య ఓటీటీలో మాత్రం పెదవులను కలిపేసింది! మరి ముద్దు సీను అంటే అది మగాడితో చేస్తే ఒకటి, ఆడవాళ్లతో చేస్తే మరోటి అనుకోవాలా, ఏమో మరి!
ఫ్యామిలీ మ్యాన్ 2 లో సమంత బోల్డ్ సన్నివేశాల్లో కనిపించింది. వాటిల్లో కొన్ని సీన్లలో సమంత స్థానంలో డూప్ కనిపించి ఉండవచ్చు కానీ, అధికారికంగా అయితే ఆమే నటించినట్టు! చేసిన రోల్ కు తగ్గట్టుగా సీన్లు ఉన్నా.. ఆమె వైవాహిక జీవితంలో మనస్పర్థలకు ఈ వెబ్ సీరిస్సే కారణమయ్యిందనే ప్రచారమూ జరిగింది.
ఇక నో కిస్సింగ్ పాలసీ అంటూ.. ఇన్నాళ్ల పాటు నెట్టుకు వచ్చింది తమన్నా. పక్కా కమర్షియల్ హీరోయినే అయినా తమన్నా చాలా పరిమితులతో దశాబ్దంన్నర పాటు నెట్టుకువచ్చింది. బయట ఎక్కడైనా ఫ్యాన్స్ అడిగినా ఫొటోలకూ, సెల్ఫీలకు కూడా స్ట్రిక్ట్ గా నో చెప్పేది. ఇక ఇండస్ట్రీలో మాత్రం డబ్బే ప్రధానంగా వ్యవహరిచిందని ఆమెతో పని చేసిన వారే చెప్పారు. అంటే స్టార్ డమ్ కొద్దీ డబ్బులు డిమాండ్ చేసింది.
మొదట్లో అవకాశాలు ఇచ్చారు, హిట్ ఇచ్చారు అంటూ వారి కోసం తక్కవ డబ్బుకు పని చేయడానికి స్ట్రిక్ట్ గా నో చెబుతుందని తమన్నాకు పేరు. అయినప్పటికీ డబ్బు కోసమే అయినా.. తెరపై మాత్రం నో కిస్ పాలసీ అంటూ మెయింటెయిన్ చేసింది! మరి ఆమె పాలసీని కూడా ఓటీటీ అడ్రస్ లేకుండా చేసింది.
ఓటీటీ-వెబ్ సీరిస్ లు అంటూ వచ్చి కూడా కట్టు దాటని, ఆ అవసరం రాని హీరోయిన్లు కొందరున్నారు. ప్రియమణి వంటి వారు మేనేజ్ చేస్తున్నారు. అయితే ముందు ముందు మాత్రం వెబ్ సీరిస్ ల వైపుకు వచ్చే హీరోయిన్లు మాత్రం బోల్డ్ బాటలో నడవక తప్పదేమో!