హిట్ ఇచ్చినా సినిమా లేదా?

శ్రీవాస్…లౌక్యం లాంటి హిట్ ఇచ్చాడు. ఆ తరువాత బాలయ్యతో డిక్టేటర్ చేసాడు. రీజనబుల్ హిట్ సినిమా అనిపించుకుంది. అయినా ఇంతవరకు మళ్లీ సినిమా  చేతికి రాలేదు. చిత్రమేమిటంటే, నిర్మాతలు లేరా అంటే ఆ సమస్య…

శ్రీవాస్…లౌక్యం లాంటి హిట్ ఇచ్చాడు. ఆ తరువాత బాలయ్యతో డిక్టేటర్ చేసాడు. రీజనబుల్ హిట్ సినిమా అనిపించుకుంది. అయినా ఇంతవరకు మళ్లీ సినిమా  చేతికి రాలేదు. చిత్రమేమిటంటే, నిర్మాతలు లేరా అంటే ఆ సమస్య కూడా లేదు. ఎందుకంటే డిక్టేటర్ తరువాత ఈరోస్ సంస్థ శ్రీవాస్ తో మరో రెండు సినిమాలు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. కానీ సరైన కాంబినేషన్ సెట్ కావడం లేదు. 

నాగ్ చైతన్యతో సినిమా చేద్దాం అని శ్రీవాస్ ప్రయత్నాలు చేసారు. కానీ ఎందుకో లాస్ట్ మినిట్ లో ఫెయిల్ అయింది. ఆ తరువాత మళ్లీ గోపీచంద్ తోనే సినిమా చేద్దాం అనుకన్నాడు కానీ అదీ సెట్ కాలేదు. ఆ తరువాత మళ్లీ సినిమా కోసం కిందా మీదా అవుతున్నాడు. కానీ సరైన హీరో ఎవరూ అందుబాటులో లేరు. దాంతో హిట్ ఇచ్చినా సైలెంట్ గా వుండిపోవాల్సి వచ్చింది శ్రీవాస్. ఇక సంపత్ నంది సినిమా అయ్యాక మళ్లీ గోపీచంద్ నే సినిమా ఇవ్వాలేమో?