cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

హాకీ క్లయిమాక్స్ అంటే భయం

హాకీ క్లయిమాక్స్ అంటే భయం

కరోనా నేపథ్యంలో ఆగిపోయిన షూటింగ్ లు మళ్లీ మెలమెల్లగా ప్రారంభం అవుతున్నాయి. ఇలా ప్రారంభమైన వాటిలో సందీప్ కిషన్ ఏ 1 ఎక్స్ ప్రెస్ ఒకటి. అయితే ఈ సినిమా క్లయిమాక్స్ చిత్రీకరణ గురించి మాత్రం టెన్షన్ పడుతున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఈ సినిమా క్లయిమాక్స్ హాకీ మ్యాచ్ నేపథ్యంలో వుంటుందని, దానికి దాదాపు రెండు వేల మంది ఆడియన్స్, ఆ ఆడియన్స్ మధ్యలో యాక్టర్లు వుండాల్సి వుంది.

తమిళంలో డైరక్టర్ సుందర్ సి నిర్మించిన నాప్తే తునాయ్ ఆధారంగా ఎ1 ఎక్స్ ప్రెస్ నిర్మిస్తున్నారని తెలుస్తోంది. ఇంటర్నేషనల్ హాకీ ప్లేయర్ తన ప్రేమ కోసం అనామకుడిగా అల్లరి చిల్లరగా హీరోయిన్ చుట్టూ తిరిగే స్టోరీ ఇది. ఈ సినిమాకు క్లయిమాక్స్ భారీ హ్యామీ మ్యాచ్ నే.

ఇప్పుడు అదే చిత్రీకరించాల్సి వుంది. కానీ ఈ షూట్ అంటే రావడానికి నటులు కొంచెం జంకుతున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే అంత మంది జనం మధ్యలోకి వస్తే కరోనా ఎఫెక్ట్ ఎక్కువగా వుండే అవకాశం తప్పకుండా వుంటుంది. అందుకే ఈ విషయంలో యూనిట్ కూడా మల్లగుల్లాలు పడుతున్నట్లు బోగట్టా.

 


×